Monday, December 23, 2024

గ్రీన్ ఇండియా ఛాలెంజ్: మొక్కలు నాటిన డాక్టర్ ఎర్రవెల్లి చంద్రశేఖర్ రావు

- Advertisement -
- Advertisement -

Dr. Erravelli Chandrasekhar Rao planted the saplings

మన తెలంగాణ/హైదరాబాద్ : తన పుట్టినరోజు సందర్భాన్ని పురస్కరించుకుని రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్‌ఇండియా ఛాలెంజ్ లో బాగంగా టిఎస్‌పిఎస్‌సి మెంబర్ డాక్టర్ ఎర్రవెల్లి చంద్రశేఖర్ రావు మొక్కలు నాటారు. ఈ సందర్భంగా చంద్రశేఖర్ రావు మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటడం సంతోషంగా ఉందని అన్నారు. పచ్చదనం పెంపు కోసం పర్యావరణ పరిరక్షణకై ఎంపి సంతోష్ చేపట్టిన ఈ ఛాలెంజ్ ప్రతి ఒక్కరు స్వీకరించి మొక్కలు నాటాలని కోరారు.

మొక్కలు నాటిన ఎస్‌పి రాహుల్ హెగ్డే

రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను స్వీకరిస్తూ తన క్యాంప్ కార్యాలయంలో జిల్లా ఎస్‌పి రాహుల్ హెగ్డే మూడు మొక్కలు నాటారు. మానవులతో పాటు సకల ప్రాణకోటి మనుగడ వృక్షాలపైనే ఆధారపడి ఉందని జిల్లా ఎస్‌పి పేర్కొన్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్‌పి మాట్లాడుతూ సిఎం హరితహారం కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా విస్తృతంగా అమలు చేయడం జరుగుతోందని, ఇందులో భాగంగా ఎంపి సంతోష్ కుమార్ ప్రవేశపెట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఉద్యమంలో పాల్గొనడం ద్వారా రానున్న రోజుల్లో భవిష్యత్తు తరాలవారికి కాలుష్య రహిత వాతావరణాన్ని అందించడం కోసం ప్రత్యక్ష భాగస్వాములవుదామని ఎస్‌పి అన్నారు. పర్యావరణ పరిరక్షణ కోసం చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం ఎంతో ఆదర్శనీయం, ఇందులో ప్రతి ఒక్కరూ పాల్గొని భవిష్యత్‌క తరాలకు మంచి వాతావరణం అందివ్యాలన్నారు.

గ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమానికి అధిక ప్రాధాన్యత ఇచ్చి జిల్లాలోని పోలీసు కార్యాలయాలలో విస్తృతంగా మొక్కలు నాటుతున్నామని తెలిపారు. అలాగే ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని సూచిస్తూ సకాలంలో వర్షాలు కురవాలన్నా, వాతావరణ సమతుల్యత కావాలన్నా మొక్కల పెంపకం ఒక్కటేన మార్గమని అన్నారు. మన భావితరాలకు కాలుష్యం లేని పర్యావరణం అందించాల్సిన నైతిక బాధ్యత మనపైనే ఉన్నదని తెలిపారు. అనంతరం జిల్లా ఎస్‌పి జగిత్యాల అడిషినల్ ఎస్‌పి రూపేష్, రామగుండం అడిషినల్ డిసిపి అఖిలమహాజన్, మునుగూరు ఎఎస్‌పి శబరీష్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను స్వీకరించాల్సిందిగా గ్రీన్ ఛాలెంజ్ విసిరారు.

మొక్కలు పెంచే బాధ్యత తీసుకోవాలి : శుభప్రద్ పటేల్

తన పుట్టినరోజు సందర్భాన్ని పురస్కరించుకుని గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమంలో భాగంగా వికారాబాద్ జిల్లా తాండూరులో రాష్ట్ర బిసి కమిషన్ సభ్యులు శుభప్రద్ పటేల్ బిసి హాస్టల్‌లో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగస్వామ్యం కావడం ఎంతో సంతోషం ఉందన్నారు. ఇది పర్యావరణ పరిరక్షణకు ఒక నిజమైన ఛాలెంజ్ అని అన్నారు. మొక్కలు నాటడం, పెంచడం బాధ్యతగా తీసుకోవాలని తెలిపారు. మొక్కలు నాటి వాటిని సంరక్షించడం వల్ల నేలతల్లికి, అలాగే మానవ సమాజానికి ఎంతో ఉపయోగకరమని తెలిపారు. మనమందరం ఆరోగ్యకరంగా ఉండాలంటే మొక్కలు నాటడం చాలా అవసరమన్నారు. ప్రతి ఒక్కరు మొక్కలు పెంచే బాధ్యత తీసుకోవాలని శుభప్రద్ పటేల్ ఆకాంక్షించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News