Sunday, December 22, 2024

డా.గూగుల్ నిజమైన డాక్టర్ కాదు.. ఒక శోధన ఇంజిన్: హెల్త్‌కేర్ కాన్‌క్లేవ్‌లో వైద్యులు

- Advertisement -
- Advertisement -

 

మన తెలంగాణ, హైదరాబాద్ : గూగుల్ నిజమైన వైద్యుడు కాదని, ఇది ఒక శోధన ఇంజిన్. వైద్య పరిస్తితి కోసం గూగుల్ సెర్చ్ చేస్తే పరిష్కారాల కంటే సమస్యలు ఎదురైతాయని వైద్యులు పేర్కొంటున్నారు. లక్షణాలు తనిఖీ చేయడం, ఆనారోగ్యం గురించి మరింత తెలుసుకోవడానికి ప్రయత్నం చేయడంలో తప్ప ఏమి లేనప్పటికి ఎక్కడ ఆపాలో తప్పక తెలుసుకోవాలని డా. పి. రఘరామ్, మంజుల అనగాని వెల్లడించారు. సోమవారం సోమాజిగూడ హోటల్ పార్క్‌లో జరిగిన ఫీక్కీ లేడిస్ ఆర్గనైజేషన్ హెల్త్‌కేర్ కాన్‌క్లేవ్‌లో జరిగిన సమావేశంలో వారు మాట్లాడుతూ ఇప్పుడు అందరి చేతుల్లో స్మార్ట్‌పోన్లు ఉండటం, గూగుల్‌ను డాక్టర్ పరిగణించడం ప్రమాదకర ట్రెండ్‌గా పరిణమిస్తోందన్నారు. ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వ్యాధి నివారణకు కనుగొనడం, స్వీయ చికిత్స కోసం ప్రయత్నించడం కంటే తనను తాను అవగాహన చేసుకోవడానికి ఉపయోగించవచ్చుని వివరించారు.

ఈ సందర్భంగా డా. రఘరామ్ వివరిస్తూ క్యాన్సర్ చికిత్సలో కౌన్సెలింగ్ చాలా ముఖ్యమని, చాలామంది యువతులకు రొమ్ము క్యాన్సర్ ఎందుకు వస్తోందన్న ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ దేశ జనాభాలో 87 శాతం మంది యువతులు, 50 ఏళ్లలోపు వారున్నారు. అందుకే చాలా మంది యువతులకు బ్రెస్ట్ క్యాన్సర్ సోకుతుందన్నారు. అపోహల గురించి మాట్లాడుతూ బ్రెస్ట్ ఫీడింగ్ రొమ్ము క్యాన్సర్‌ను నిరోధించదని, అయితే ప్రమాదాన్ని తగ్గుస్తుందని తెలిపారు. అనంతరం డా. మంజుల అనగాని ప్రసంగిస్తూ మహిళలు సాధారణంగా ఉపయోగించే శానిటరీ ప్యాడ్‌లలో సూపర్ అబ్సార్బెంట్ పాలిమర్‌లు ఉంటాయి. అవి వాడటానికి మంచివికావు, తప్పనిసరిగా మరిన్ని హెల్త్ ప్రెండ్లీ ప్యాడ్‌లకు వెళ్లాలని సూచించారు. శారీరక శ్రమ, ఏదైనా శారీరక శ్రమ సాధ్యం కాకపోతే,కనీసం 15 నిమిషాల పాటు గదిలో డ్యాన్స్ చేయడానికి ప్రయత్నించాలి.

అప్పుడు ఆరోగ్యానికి అద్భుతంగా పనిచేస్తుందన్నారు. అదే విధంగా అపోలో ఆర్థోపెడిక్ సర్జన్ డా. కార్తీక్ పింగిల్ మాట్లాడుతూ సమస్య ఉన్నంత వరకు హై హీల్ పాదరక్షలు ధరిస్తే ఎటువంటి హాని జరగదని, మహిళల్లో మోకాళ్లు, కీళ్ల నొప్పులకు సంబంధించిన సమస్యలపై వివరిస్తూ స్త్రీలకు వెన్ను, మోకాలు, కీళ్ల నొప్పులను నివారించాలని జిమ్ ఫిట్‌నెస్ నిపుణులు ప్రోత్సహిస్తున్నందుకు అసమంజసమైన బరువులు ఎత్తడం మానుకోవాలని చెప్పారు. నడక, పరుగు, ట్రెడ్‌మిల్ మోకాళ్లపై ప్రభావం చూడదన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News