Sunday, December 22, 2024

మొక్కలు నాటిన హెటిరో డైరెక్టర్ డా.రత్నాకర్‌రెడ్డి

- Advertisement -
- Advertisement -

Dr. Ratnakar Reddy, director of Hetero who planted saplings

మన తెలంగాణ/హైదరాబాద్ : తన పుట్టినరోజు సందర్భాన్ని పురస్కరించుకుని రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా హెటిరో డైరెక్టర్ డాక్టర్ రత్నాకర్‌రెడ్డి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా రత్నాకర్‌రెడ్డి మాట్లాడుతూ పుట్టినరోజు సందర్భంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొని మొక్కలు నాటడం సంతోషంగా ఉందన్నారు. ప్రతి ఒక్కరు తమ వంతు బాధ్యతగా మొక్కలు నాటాలని కోరారు. ఇంత మంచి కార్యక్రమంలో భాగస్వామ్యం చేసినందుకు ఎంపి సంతోష్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ పాండురంగారెడ్డి, డాక్టర్ యోగేష్ రెడ్డి, కొనుకటి రమేష్‌రెడ్డి పాల్గొన్నారు.

మొక్కలు మనకు ప్రాణాధారం : ఎస్‌పి వెంకటేశ్వర్లు

పర్యావరణాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉన్నదని ఇందుకోసం అందరూ మొక్కలు నాటాలని జిల్లా ఎస్‌పి వెంకటేశ్వర్లు అన్నారు. ఎంపి జోగినపల్లి సంతోష్ కుమార్ కొనసాగిస్తున్న గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ని స్ఫూర్తిగా తీసుకొని జోగులాంబ గద్వాల్ జిల్లా ఎస్‌పి జె.రంజన్ రతన్ కుమార్, కామారెడ్డి జిల్లా ఎస్‌పి బి.శ్రీనివాస్‌రెడ్డి విసిరిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను స్వీకరించి జిల్లా పోలీసు కార్యాలయంలోని పరేడ్ గ్రౌండ్లో, పోలీసు సిబ్బందితో కలిసి మహబూబ్‌నగర్ జిల్లా ఎస్‌పి వెంకటేశ్వర్లు మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎస్‌పి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం ప్రతిష్టాత్మకంగా ఈ హరితహారం కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగు తుందని, అందులో భాగంగా జిల్లాలోని అన్ని పోలీస్‌స్టేషన్లలో మొక్కలు నాటాలని చెప్పారు. చెట్లను మానవాళి అవసరాల కోసం నరికివేయడం, అందుకు అనుగుణంగా మొక్కల పెంప కం చేపట్టకపోవడం కారణంగా కరవు పరిస్థితులు ఏర్పడుతున్నాయన్నారు. అందువల్ల ప్రతి ఒక్కరు విధిగా మొక్కలు నాటడం ఒక సామాజిక బాధ్యతగా తీసుకోవాలని సూచించారు.

ప్రాణాధారమైన మొక్కలను నాటి సంరక్షించడం ద్వారా సకాలంలో ఋతుపవనాలు రావ డమే కాకుం డా సమృద్ధిగా వర్షాలు కురుస్తాయని చెప్పారు. హరితహారం కార్యక్రమంలో ప్రతి పౌరుడు భాగస్వామ్యం కావడం ద్వారా భావి తరాలకు కాలు ష్య రహితమైన వాతావరణం అందించాల్సిన బాధ్యత మనపైన ఉన్నదన్నారు. అనంతరం వికారాబాద్ జిల్లా ఎస్‌పి కోటిరెడ్డికి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ విసిరారు. మొక్కలు నాటి హరితహార కార్యక్రమాన్ని కొనసాగించాల్సిందిగా జిల్లా ఎస్‌పి కోరారు. ఈ కార్యక్రమంలో డిఎస్‌పి సత్య నారాయణ, వెంకటేశ్వరరావు, ఆర్‌ఐ రాఘవరావు, సిఐ శ్రీకాంత్‌రెడ్డి, సూపరింటెండెంట్ శంకర్‌లాల్, ఎస్‌ఐలు సురేష్‌గౌడ్, శంషోద్దిన్, శివ నాగేశ్వర నాయుడు, వసంత, సునీత, డిపిఒ స్టాఫ్, ఆర్మ్‌డ్ రిజర్వ్ పోలీసు సిబ్బంది, స్పెషల్ పార్టీ, హోంగార్డ్ అధికారులు పాల్గొని మొక్కలు నాటారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News