Wednesday, September 18, 2024

ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ. 5 కోట్ల విరాళం

- Advertisement -
- Advertisement -

వరద బాధితులను ఆదుకోవాలని సిఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చిన మేరకు ప్రముఖులు, దిగ్గజ సంస్థలు, సెలబ్రిటీలు, ఉద్యోగులు, నాయకులు, భారీగా సిఎం సహాయనిధికి విరాళాలు అందజేస్తున్నారు. ఈ క్రమంలోనే వరద బాధితులను ఆదుకోవడంలో భాగంగా ప్రఖ్యాత డాక్టర్ రెడ్డీస్ ల్యాబోరేటరీస్ సంస్థ ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ. 5 కోట్ల విరాళాన్ని అందించింది. రెడ్డీస్ ల్యాబ్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ వి.నారాయణ రెడ్డి సచివాలయంలో శుక్రవారం సిఎం రేవంత్ రెడ్డిను కలిసి ఈ విరాళానికి సంబంధించిన చెక్కును అందజేశారు. సహాయ కార్యక్రమాల కోసం ఔదార్యం చాటుకున్న రెడ్డీస్ ల్యాబ్‌ను ముఖ్యమంత్రి అభినందించారు. సిఎంతో పాటు మంత్రులు పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస రెడ్డి, ఎమ్మెల్యే కుందూరు జయవీర్ రెడ్డి, జీహెచ్‌ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మీతదితరులు ఉన్నారు.

రూ.50 లక్షల చెక్కును అందచేసిన బాలకృష్ణ కూతురు
ప్రముఖ నటులు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తెలంగాణ వరద బాధితుల సహాయార్థం రూ.50 లక్షలు ముఖ్యమంత్రి సహాయ నిధికి ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ చెక్కును బాలకృష్ణ రెండో కుమార్తె తేజస్విని సిఎం రేవంత్ రెడ్డికి అందజేశారు. శుక్రవారం ఆమె హైదరాబాద్‌లోని సిఎం రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్లి బాలకృష్ణ తరపున ఈ చెక్కును అందించారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రకటించిన రూ.50 లక్షలను గురువారం బాలకృష్ణ చంద్రబాబుకు అందజేసిన విషయం తెలిసిందే.

ఏఏంఆర్ ఇండియా రూ.కోటి విరాళం
వీరితో పాటు ఏఎంఆర్ ఇండియా కంపెనీ సిఎం సహాయనిధికి రూ.ఒక కోటి విరాళం అందించింది. ఈ మేరకు కంపెనీ ఎండి ఎ.మహేశ్ కుమార్ రెడ్డి సిఎం నివాసంలో రేవంత్ రెడ్డిని కలిసి ఈ చెక్కును అందజేయగా, వెస్ట్రన్ కన్‌స్ట్రక్షన్ నుంచి ఆర్.సుదర్శన్‌రెడ్డి, ఎపి సంజయ్‌రెడ్డిలు కోటి రూపాయల చెక్కును సిఎం అందచేశారు. అలాగే వాక్సన్ యూనివర్సిటీ వ్యవస్థాపకుడు కె. ప్రవీణ్ పూల సిఎంకు రూ.50 లక్షల చెక్కును అందజేశారు. వరద బాధితుల సహాయం కోసం ప్రభుత్వానికి అండగా నిలుస్తూ విరాళాలు అందించిన వారిని ఈ సందర్భంగా సిఎం అభినందించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News