Wednesday, January 22, 2025

మైగ్రేన్ బాధితులకు శుభవార్త

- Advertisement -
- Advertisement -

మైగ్రేన్ బాధితుల అవస్థ మాటల్లో చెప్పలేం. గంటల తరబడి భరించలేని తలనొప్పితో బాధపడుతూ ఉంటారు. రకరకాల మందులు వాడినా ఉపశమనం దొరక్క అల్లాడిపోతూ ఉంటారు. ప్రపంచవ్యాప్తంగా మొత్తం జనాభాలో సుమారు నాలుగు శాతం మంది మైగ్రేన్ బాధితులే. అలాంటివారికి డాక్టర్ రెడ్డీస్ సంస్థ శుభవార్త చెప్పింది. మైగ్రేన్ కోసం డాక్టర్ రెడ్డీస్ సంస్థ ఓ పరికరాన్ని రూపొందించింది. దాని పేరు నెరివియా. దీనిని చేతి పైభాగంలో జబ్బకు కట్టుకుంటే చాలు. మైగ్రేన్ తగ్గిపోతుందట. నెరివియాకు అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (యుఎస్ఎఫ్ డిఏ) అనుమతి లభించడం విశేషం. మందులు వాడకుండా నొప్పి తగ్గాలని ఆశించేవారికి ఇదొక ప్రత్యామ్నాయం.

పన్నెండేళ్లు లేదా ఆపై వయసున్నవారు ఈ పరికరాన్ని ధరించవచ్చు. ఇది నాడుల కొనభాగాలను రిమోట్ ఎలక్ట్రికల్ న్యూరోమాడ్యులేషన్ (ఆర్ఇఎన్) పద్ధతిలో ప్రేరేపిస్తూ, మైగ్రేన్ ను తగ్గిస్తుంది. నెరివియాను చేతికి కట్టుకోవడం వల్ల ఎలాంటి దుష్పరిణామాలు ఉండవనీ, ఇది సురక్షితమైన పరికరమని డాక్టర్ రెడ్డీస్ కు చెందిన బ్రాండెడ్ మార్కెట్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎం.వి.రమణ తెలిపారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News