Monday, January 20, 2025

తొమ్మిదేళ్లు నిద్ర పోయి ఇప్పడు నిద్ర లేచారు..: కాంగ్రెస్ విమర్శ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : నిరుద్యోగులకు భరోసా ఇవ్వడానికి వారికి అండగా నిలిచి వారడిగిన చిన్న కోరికకు మద్దతుగా టీ పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి పిలుపు మేరకు శనివారం హైదరాబాద్‌లో జరగనున్న ఓ కార్యక్రమానికి బయలు దేరిన వారిని పోలీసులు అక్రమంగా హౌస్ అరెస్ట్ చేయడం నిరంకుశ పాలనకు నిదర్శనమని కాంగ్రెస్ పార్టీ ఖైరతాబాద్ డిసిసి అధ్యక్షులు డాక్టర్ రోహిన్ రెడ్డి ప్రభుత్వాన్ని విమర్శించారు. తొమ్మిది సంవత్సరాలు నిద్రపోయి ఎన్నికలు రాగానే నిద్ర లేచిన తీరుగా బిఆర్‌ఎస్ విధానం ఉందన్నారు. వారి నిరంకుశ పాలనకు చరమగీతం పాడే రోజులు దగ్గర పడ్డాయన్నారు.

గడచిన కాలంలో ఒకే ఒక్క నోటిఫికేషన్ వేసిన సర్కారు అదే ఎన్నికలు రాగానే హరీబరీగా నోటిఫికేషన్ వేసి నిరుద్యోగులను ఇబ్బందులకు గురి చేశారన్నారు. మరో వైపు అటు బిజెపి నాయకులు కూడా ఈ విషయాన్ని డైవర్ట్ చేయడానికి అన్నట్లు..డబుల్ బెడ్ రూం ఇళ్లపై ధర్నా నిర్వహించడం వారి చీకటి ఒప్పందంలో భాగమేనన్నారు. ప్రభుత్వం తక్షణం రూ. 3 వేల భృతిని విద్యార్థుల అకౌంట్లలో నేరుగా వేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఖైరతాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అన్ని డివిజన్ల అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News