Wednesday, January 22, 2025

గాలి ద్వారా ‘మంకీపాక్స్’ సోక‌దు : ఫీవ‌ర్ హాస్పిట‌ల్ సూప‌రింటెండెంట్‌

- Advertisement -
- Advertisement -

 

Kerala reports second confirmed monkeypox case

హైద‌రాబాద్: మంకీపాక్స్ గురించి ప్ర‌జ‌లెవ‌రూ ఆందోళ‌న చెందాల్సిన అవ‌స‌రం లేద‌ని ఫీవ‌ర్ హాస్పిట‌ల్ సూప‌రింటెండెంట్ డాక్ట‌ర్ శంక‌ర్ స్ప‌ష్టం చేశారు. ల‌క్ష‌ణాలు ఉన్న వ్య‌క్తికి ద‌గ్గ‌రగా ఉన్న వారికి మాత్రమే మంకీపాక్స్ సోకే అవ‌కాశం ఉంద‌న్నారు. గాలి ద్వారా మంకీపాక్స్ సోక‌ద‌ని, పెద్ద‌గా ద‌గ్గిన‌ప్పుడు వ‌చ్చే తుంప‌ర్ల ద్వారానే సోకే అవ‌కాశం ఉంద‌ని స్ప‌ష్టం చేశారు.

మంకీపాక్స్ ల‌క్ష‌ణాల‌తో ఆస్ప‌త్రిలో చేరిన బాధితుడి ఆరోగ్య ప‌రిస్థితి నిల‌క‌డ‌గా ఉంద‌ని డాక్ట‌ర్ శంక‌ర్ వెల్ల‌డించారు. బాధిత వ్య‌క్తి నుంచి న‌మూనాలు సేక‌రించి, పుణెలోని ఎన్ఐవి ల్యాబ్‌కు పంపించామ‌ని తెలిపారు. రేపు సాయంత్రానికి రిపోర్టు వ‌స్తుంద‌న్నారు. ఈ నెల 6వ తేదీన బాధితుడు కువైట్ నుంచి వ‌చ్చాడ‌ని,  బాధితుడు నీర‌సం, జ్వ‌రంతో  కామారెడ్డిలోని ఓ ప్ర‌యివేటు హాస్పిట‌ల్‌కు వెళ్లాడని తెలిపారు. శ‌రీరంపై ఉన్న ద‌ద్దుర్లు మంకీపాక్స్ మాదిరిగా ఉండ‌టంతో ఫీవ‌ర్ హాస్పిట‌ల్‌కు వ‌చ్చాడని పేర్కొన్నారు. రోగికి సానిహిత్యంగా ఉన్న ఆరుగురిని వేరుగా(ఐసోలేష‌న్‌లో) ఉంచామ‌ని స్ప‌ష్టం చేశారు. మంకీపాక్స్ ల‌క్ష‌ణాల‌తో విదేశాల నుంచి వ‌చ్చిన వారు స‌మాచారం ఇవ్వాల‌న్నారు. 6 నుంచి 13 రోజుల్లో వ్యాధి ల‌క్ష‌ణాలు బ‌య‌ట‌ప‌డుతాయ‌ని డాక్ట‌ర్ శంక‌ర్ వివరించారు.
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News