Monday, December 23, 2024

ప్రాణాలతో పోరాడుతూ డాక్టర్ శ్రావణి మృతి

- Advertisement -
- Advertisement -

Dr Shravani dies in Malakpet hit and run case

హైదరాబాద్: మూడు రోజుల క్రితం హిట్ అండ్ రన్ కేసులో గాయపడిన డాక్టర్ శ్రావణి శనివారం తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు. డాక్టర్ శ్రావణి హస్తినాపురంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో డెంటల్ డాక్టర్‌గా పనిచేశారు. సెప్టెంబర్ 21న ఓలా బైక్‌ను బుక్ చేసుకుంది. వెళ్తుండగా గుర్తుతెలియని కారు బైక్‌ను ఢీకొట్టడంతో బైక్‌ డ్రైవర్‌ వెంకటయ్య, శ్రావణికి గాయాలయ్యాయి. ఇద్దరినీ ఆసుపత్రిలో చేర్చారు. డాక్టర్ శ్రావణి తలకు బలమైన గాయం కాగా మూడు రోజుల చికిత్స అనంతరం శనివారం మృతి చెందింది. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుడిని ఇబ్రహీంగా పోలీసులు గుర్తించారు. మలక్‌పేటకు చెందిన ఇబ్రహీం వద్ద కారుకు సంబంధించిన లైసెన్స్‌, సంబంధిత పేపర్లు లేవు. శ్రావణి కుటుంబంలో నెల రోజుల్లో ఇది రెండో మరణం కావడంతో ఆమె కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. శ్రావణి తల్లి గుండెపోటుతో 25 రోజుల క్రితం మరణించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News