Wednesday, January 22, 2025

పలువురికి డాక్టర్ వాసిరెడ్డి పరామర్శ

- Advertisement -
- Advertisement -

బోనకల్ : ఇటీవల వివిధ అనారోగ్య కారణాలతో చికిత్స పొందిన తెలుగుదేశం కుటుంబాలకు చెందిన బాదితులును టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ వాసిరెడ్డి రామనాథం శుక్రవారం మండలంలో పర్యటించి పరామర్శించారు. ప్రధానంగా ఇటీవల అనారోగ్యానికి గురైన మండల టీడీపీ అద్యక్షుడు రావుట్ల సత్యనారాయణ సతీమణిని ఆయన మాతృమూర్తిని పరామర్శించారు.

చొప్పకట్లపాలెం గ్రామానికి చెందిన మండెపూడి మోహన్‌రావుకు ఇటీవల ప్రమాదవశాత్తూ చేయి విరిగింది దీంతో ఆయనను రామనాథం పరామర్శించారు. పక్షవాతంతో బాధపడుతున్న మండెపూడి వెంకటనర్సమ్మను, మెట్టెల లకా్ష్మద్రిని పరామర్శించారు. ఈ కార్యక్రమంలో నాయకులు నందమూరి సత్యనారాయణ, కొమ్మినేని సైదయ్య, చిత్రాల వెంకటేశ్వర్లు, ఏసుపోగు నాగేశ్వరావు, మండెపూడి గోర్కీ, నంద్యాల వెంకటేశ్వర్లు, తన్నీరు వెంకయ్య, తెల్లబోయిన లక్ష్మీ పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News