Friday, November 22, 2024

క్రిమినల్ చట్టాల బిల్లులకు బ్రేక్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: క్రిమినల్ చట్టాల ప్రత్యామ్నాయ వ్యవస్థ ఖరారుపై కేంద్రం తుది నిర్ణయానికి రాలేకపోయింది. ఇంతకు ముందటి చట్టాలకు ప్రత్యామ్నాయ సంబంధిత మూడు బిల్లుల ముసాయిదా నివేదిక ఆమోదం వాయిదా పడింది. శుక్రవారం ఈ ప్రక్రియ పూర్తి కావాల్సి ఉంది. అయితే ఇది కుదరలేదు. సంబంధిత పార్లమెంటరీ కమిటీ వచ్చే నెల 6వ తేదీన దీనిపై తిరిగి సమావేశం కానుందని అధికార వర్గాలు శుక్రవారం తెలిపాయి. ప్యానెల్‌కు చెందిన కొందరు ప్రతిపక్ష సభ్యులు ఈ బిల్లుల ముసాయిదాలపై పరిశీలనకు తమకు మరింత సమయం కావాలని కోరాయి. దీనితో శుక్రవారం నాటి ఆమోద ప్రక్రియ నిలిచిపోయింది.

వర్షాకాల పార్లమెంట్ సమావేశాల దశలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా వలసపాలననాటి శిక్షాస్మృతి చట్టాలను పూర్తి స్థాయిలో ఏరివేసేందుకు మూడు బిల్లులను ప్రవేశపెట్టారు. ఇండియన్ పీనల్ కోడ్(ఐపిసి), ది కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్, 1973, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్, 1872లను నిరర్థకమని పేర్కొంటూ వీటి స్థానంలో భారతీయ న్యాయ సన్హిత, భారతీయ నాగరిక్ సురక్ష సన్హిత, భారతీయ సాక్ష అధినియమ్ బిల్లులను తీసుకువచ్చారు. వీటిని సభ తరువాత స్క్రూటినిల కమిటీకి పంపించింది. ఈ బిల్లులను తాము సమగ్రంగా పరిశీలించాల్సి ఉందని, అప్పటివరకూ ఆమోదం కుదరదని కమిటీ సభ్యుల్లో ఒక్కరైన కాంగ్రెస్ నేత పి చిదంబరం కమిటీ ఛైర్‌పర్సన్ బ్రిజ్‌లాల్‌కు లేఖ పంపించారు. దీనితో ప్రక్రియకు బ్రేక్ పడింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News