కరీంనగర్: జిల్లాలో డ్రాప్ట్ ఓటరు జాబితా రూపకల్పన పకడ్బందీగా చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ అన్నారు. శుక్రవారం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్‌రాజ్ రానున్న సాధారణ ఎన్నికలపై వీడియో కాన్పరెన్స్ ద్వారా ఈవీఎంలు, వీవీ ప్యాట్‌ల ఉపయోగం కోసం డిజిటల్ ఔట్రీచ్, ఓటరు జాబితాలోని డిలిషన్‌తో పాటు పలు అంశాలపై జిల్లా ఎన్నికల అధికారులతో వీడియో కాన్పరెన్స్ ద్వారా సమీక్షించారు.
ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి మాట్లాడుతూ రెండవ విడత ఓటరు జాబితా సవరణలో భాగంగా డ్రాఫ్ట్ ఓటరు జాబితా విడుదల ముందు, మనకు వచ్చిన ప్రతి దరఖాస్తు స్కూటీని పూర్తి చేయాలని, ఓటరు జాబితా నుండి తొలగించిన ఓటర్ల వివరాలను క్షేత్రస్థాయిలో మరోసారి ధృవీకరణ పూర్తి చేయాలని, ఇంటికి ఆరు కంటే అధికంగా ఉన్న ఓటర్ల వివరాల ధృవీకరణను పూర్తి చేయాలని తెలిపారు.
జిల్లాలో ఇంటింటి సర్వే నేపథ్యంలో వచ్చిన దరఖాస్తులు, ఆన్‌లైన్ ద్వారా ఫారం -6, ఫారం -7, ఫారం -8 కింద వచ్చిన దరఖాస్తులను జూలై 27 నాటికి ఫీల్డ్ వెరిఫికేషన్ పూర్తి చేయాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ ఆర్‌వి కర్ణన్, అదనపు కలెక్టర్ జీవీ శ్యాంప్రసాద్ లాల్, శిక్షణ సంయుక్త కలెక్టర్ నవీన్ నికోలస్, కరీంనగర్, హుజురాబాద్ ఆర్డీవోలు ఆనంద్‌కుమార్, హరిసింగ్, కలెక్టరేట్ ఏవో జగత్‌సింగ్, తహసిల్దార్లు, ఎలక్షన్ డీటీలు పాల్గొన్నారు.