Friday, December 27, 2024

మృతదేహాన్ని రోడ్డుపై ఈడ్చుకెళ్లి… (వీడియో వైరల్)

- Advertisement -
- Advertisement -

పాట్నా: మృతదేహాన్ని రోడ్డుపై ఈడ్చుకెళ్లి ట్రాక్టర్లలో వేసిన దృశ్యం బీహార్ రాష్ట్రం బెగూసరోయ్ ప్రాంతంలో జరిగింది. లాకో పోలీస్ స్టేషన్ లో పరిధిలోని నిపానియా సిమెంట్ ఫ్యాక్టరీ సమీపంలో ఓ మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని శవ పరీక్ష నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించే సమయంలో మున్సిపల్ సిబ్బంది శవానికి తాడు కట్టి  కొంచె దూరం లాక్కెళ్లారు. అనంతరం శవాన్ని ట్రాక్టర్ లో పడేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. జంతు కళేబరంలాగా లాక్కెళ్లారని పోలీసులపై స్థానికులు మండిపడ్డారు. సదరు పోలీసులు చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేశారు. సదరు ఎస్ఐ వ్యవహరించిన తీరుపై  ఉన్నతాధికారులు కూడా అగ్రహంగా ఉన్నారు. సదరు పోలీసులపై చర్యలు తీసుకుంటామని ఎస్ పి యోగేంద్ర శర్మ తెలిపాడు. ఎస్ఐ అనిల్ కుమార్ ను సస్పెండ్ చేశామని ఎస్ పి తెలిపారు. మృతుడి వివరాలు తెలియలేదని పోలీసులు పేర్కొన్నారు.

https://twitter.com/AsianDigest/status/1552808301754138624?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1552808301754138624%7Ctwgr%5E7874221e3e51ce8deaac82e4acf0dd99a45c8f41%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.indiatimes.com%2Fnews%2Findia%2Fbody-tied-with-rope-dragged-away-for-autopsy-in-bihars-begusarai-576006.html

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News