Monday, January 20, 2025

ముషీరాబాద్‌లో ఏరులై పారుతున్న డ్రైనేజీ

- Advertisement -
- Advertisement -

ముషీరాబాద్ : ముషీరాబాద్‌లో డ్రైనేజీ ఏరులై పారుతుండటంతో ప్రజలు సతమతం అవుతున్నా రు. ముషీరాబాద్.. సికింద్రాబాద్ ప్రధాన రహదారి రాజా డీలక్స్ వద్ద మెయిన్ రోడ్డపై డ్రైనేజీ పొంగిపొర్లుతోంది. అం తే కాకుండా, ఈ కారణంగా రాజా డీలక్స్ నుంచి రాంనగ ర్ చేపల మార్కెట్ రోడ్డు మలుపు వరకూ డ్రైనేజీ వరదలా పారుతోంది. ఇదిలా ఉండగా, ముషీరాబాద్ డిపో వెనుకా ల ఫైర్ స్టేషన్ వద్ద మెయిన్ రోడ్డుపై డ్రైనేజీ తరుచూగా లీక్ అవుతూ అటు వైపుగా వెళ్తున్న ప్రజలను, వాహనదారుల ను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోంది.

ఈ రెండు సమస్యలు ప్రతి రెండ్రోజులకోసారి, లేదంటే వారానికోసారి పునరావృత్తం అవుతున్నాయి. ఈ ప్రాంతాల్లో డ్రైనేజీ లీకేజ్ కా మన్‌గా మారిపోవడంతో వాటర్ వర్క్ అధికారులు సైతం లైట్‌గా తీసుకుంటున్నట్టు అర్థమవుతోంది. ఇప్పటికే అనేక సార్లు ఫిర్యాదులు స్వీకరించినప్పటికీ, పలుమార్లు మరమ్మతులు చేసినప్పటికీ అదే ప్రాంతంలో అదే సమస్య పదే పదే పునరావృత్తం కావడాన్ని ప్రజలు అధికారులను చీత్కరించుకుంటున్నారు. ఈ సమస్యలను తాత్కాలికంగా కాకుండా, శాశ్వతంగా పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News