Monday, November 18, 2024

అనుకోని అతిథి రాకతో హైడ్రామా

- Advertisement -
- Advertisement -

ముంబయి: కాంగ్రెస్ మాజీ నేత,రాజ్యసభ సభ్యుడు కపిల్ సిబల్ శుక్రవారం ముంబయిలో జరుగుతున్న విపక్ష ఇండియా కూటమి సమావేశంలో హాజరు కావడంతో కొంత హైడ్రామా నెలకొంది. ఎవరూ ఊహించని విధంగా ఆయన ఎంట్రీ ఇవ్వడంతో కాంగ్రెస్ నేతలు ఒకింత అసహనానికి గురయినట్లు తెలుస్తోంది. సిబల్ కొద్దికాలంక్రితం కాంగ్రెస్ పార్టీకి గుడ్‌బై చెప్పి సమాజ్‌వాదీ పార్టీ మద్దతుతో రాజ్యసభకు స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికయ్యారు. ఇండియా కూటమికి ఆయనకు అధికారికంగా ఆహ్వానం లేనప్పటికీ ఆయన విచ్చేశారు. విపక్ష నేతలంతా కలిసి గ్రూపు ఫొటో దిగడానికి ముందు ఈ పరిణామం చోటు చేసుకుంది.

సిబల్ రాకను కాంగ్రెస్ సీనియర్ నేత కెసి వేణుగోపాల్ నేరుగా ఇండియా కూటమి సమావేశానికి ఆతిథ్యం ఇస్తున్న శివసేన నేత ఉద్ధవ్ థాక్రే దృష్టికి తీసుకెళ్లారు. దీంతో నేషనల్ కాంగ్రెస్ నేత ఫరూక్ అబ్దుల్లా, సమాజ్‌వాది పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ జోక్యం చేసుకుని వేణుగోపాల్‌కు నచ్చజెప్పారు. సార్వత్రిక ఎన్నికలకు ముందు అన్ని పార్టీలను ఏకతాటిపైకి తెచ్చే ఉద్దేశంతో సమావేశం ఏర్పాటయినందున కపిల్ రాకను సమ్మతించాలని వారు ఆయనను కోరారు. మరో వైపు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సైతం కపిల్ సిబల్ రాకపై తనకెలాంటి అభ్యంతరాలు లేవని చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో పరిస్థితి సద్దుమణిగింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News