Monday, December 23, 2024

అర్ధరాత్రి హైవేపై రెండు గ్రూపుల వీరంగం

- Advertisement -
- Advertisement -

కర్ణాటకలో రెండు కార్లలో ఆరుగురు యువకులు రాత్రివేళ రోడ్డుపై వీరంగం సృష్టించారు. కార్లతో పరస్పరం ఢీకొట్టుకున్నారు. కర్రలతో దాడులు చేసుకున్నారు. ఈ సంఘటనలో కర్ర పట్టుకున్న యువకుడిని మరో గ్రూపుకు చెందిన కారు ఢీకొనడంతో తీవ్రంగా గాయపడ్డాడు. మే 18న ఉడుపి మణిపాల్ హైవేపై జరిగిన ఈ సంఘటన దృశ్యాలు తాజాగా సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. కర్ణాటకకు చెందిన ఓ డాక్టర్ దీన్ని తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేస్తూ నిందితులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ వీడియో వైరల్ కావడంతో పోలీస్‌లు దర్యాప్తు చేసి నిందితుల్లో ఇద్దరిని అరెస్ట్ చేశారు. మరో నలుగురి కోసం గాలిస్తున్నట్టు చెప్పారు. ఆర్థిక పరమైన వివాదాలే గ్రూపుల మధ్య కొట్లాటకు దారి తీసిందని తెలుస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News