Monday, December 23, 2024

పురుషుల్లో భారీగా తగ్గ్గుతున్న వీర్యకణాల సంఖ్య

- Advertisement -
- Advertisement -

 

న్యూఢిల్లీ: భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో గత కొన్నేళ్లుగా పురుషుల్లో వీర్యకణాల సంఖ్య గణనీయంగా తగ్గుతున్నట్లు శాస్త్రజ్ఞులు గుర్తించారు. వీర్యకణాలు సంతానోత్పత్తికి, పురుషుల ఆరోగ్యానికి సంకేతాలే కాకుండా దీర్ఘకాలిక వ్యాధులు, వృషణాల క్యాన్సర్ లాంటి వ్యాధులు రావడానికి , అలాగే ఆయుఃప్రమాణం తగ్గడానికి దీనికి సంబంధాలున్నాయని పరిశోధకులు అంటున్నారు. వీర్యకణాల తగ్గుదల ఆధునిక వాతావణం, జీవన శైలికి సంబంధించిన ప్రపంచవ్యాప్త ంగా ఎదురవుతున్న సంక్షోభానికి అద్దం పడుతుండడమే కాకుండామానవాళి మనుగడపైనా తీవ్ర ప్రభావాన్ని చూపించే ప్రమాదం ఉందని వారంటున్నారు. హ్యూమన్ రీప్రొడక్షన్ కలెక్షన్ అనే జర్నల్‌లో మంగళవారం ఈ అధ్యయనం ప్రచురితం అయింది. 53 దేశాలకు సంబంధించిన గణాంకాలను అధ్యయనం చేసి ఈ నివేదికను రూపొందించారు.

దీనిలో ఏడేళ్ల అదనపు డేటాను చేర్చడమే కాకుండా ఇంతకు ముందు సమీక్షించని ముఖ్యంగా దక్షిణ అమెరికా, ఆసియా, ఆఫ్రికా ప్రాంతాల్లో పురుషుల్లో వీర్యకణాల సంఖ్య తగ్గుతున్న తీరుపైన ప్రధానంగా దృష్టిపెట్టింది. ఇంతకు ముందు ఉత్తర అమెరికా, యూరప్, ఆస్ట్రేలియా ప్రాంతాల్లో కనిపించినట్లుగా ఈ ప్రాంతాల్లో కూడా పురుషుల్లో మొత్తం వీర్యకణాల సంఖ్య(టిఎస్‌సి)తో పాటుగా వీర్య కేంద్రీకరణ (ఎస్‌సి) తగ్గుదల గణనీయంగా ఉన్నట్లు మొట్టమొదటిసారి గుర్తించడం జరిగింది. ప్రపంచవ్యాప్తంగా 2000 సంవత్సరం తర్వాత ఈ రెండింటి తగ్గుదల వేగంగా జరుగుతున్నట్లు ఈ అధ్యయనంలో వెల్లడయింది. ‘ఈ విస్తృత అధ్యయనంలో భారత్ కూడా ఒక భాగమే. మెరుగైన డేటా కారణంగా భారత్‌లో ఈ తగ్గుదల బలంగా ఉన్నట్లు మేము గుర్తించగలిగాం. అయితే ప్రపంచవ్యాప్తంగా ఉన్న దానిలాగే ఉంది’ అని ఇజ్రాయెల్‌లోని జెరూసలెం హీబ్రూ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్ హగాయ్ లెవిన్ పిటిఐతో అన్నారు.

మొత్తంమీద గత 46 ఏళ్లలో వీర్యకణాల సంఖ్యలో 50 శాతానికి పైగా తగ్గుదలను తాము గమనించామని, ఇటీవలి కాలంలో ఈ తగ్గుదల వేగంగా జరుగుతోందని కూడా ఆయన చెప్పారు. అయితే వీర్యకణాల సంఖ్య తగ్గుదలకు కారణాలను ఈ అధ్యయనం పరిశీలించకపోయినప్పటికీ, పిండం జీవిత కాలంలో పునరుత్పత్తి మార్గంలో అలజడుల కారణంగా పిండోత్పత్తికి సంబంధించి జీవితకాలం అడ్డంకులు ఎదురు కావడం, పునరుత్పత్తి పని చేయకపోవడం లాంటి వాటికి ఇది సంకేతమని ఇటీవల పరిశోధన పేర్కొన్న విషయాన్ని లెవిన్ చెప్పారు. వీటికి తోడు జీవన శైలి అలవాట్లు, వాతావరణంలో రసాయనాలు ఈ పిండం అభివృద్ధిని తీవ్రంగా దెబ్బ తీస్తున్నాయని కూడా ఆయన వివరించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News