Monday, December 23, 2024

మద్దతు కోరుతూ సోరెన్‌కు ముర్ము ఫోన్

- Advertisement -
- Advertisement -

Draupadi Murmu called up Jharkhand CM

రాష్ట్రపతి ఎన్నికలపై జెఎంఎం సమావేశం

న్యూఢిల్లీ: ప్రతిపక్ష నాయకుల మద్దతును కూడగట్టే ప్రయత్నంలో భాగంగా ఎన్‌డిఎ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము శనివారం జార్ఖండ్ ముక్తి మోర్చ(జెఎంఎం) అధినేత, జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌కు ఫోన్ చేసి తనకు మద్దతు ఇవ్వాలని కోరినట్లు వర్గాలు తెలిపాయి. సోరెన్‌కు వ్యక్తిగతంగా ఫోన్ చేసిన ముర్ము తన అభ్యర్థిత్వాన్ని బలపరచాలని కోరినట్లు వర్గాలు పేర్కొన్నాయి. కాగా..నామినేషన్ వేయడానికి ముందు ముర్ము కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఎన్‌సిపి అధినేత శరద్ పవార్, టిఎంసి అధ్యక్షురాలు, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి కూడా ఫోన్ చేసి మాట్లాడారు. ఈ ముగ్గురు నాయకులు కూడా ముర్ముకు శుభాకాంక్షలు తెలియచేశారని వర్గాలు చెప్పాయి. ఇలా ఉండగా&రానున్న రాష్ట్రపతి ఎన్నికలపై చర్చించేందుకు గిరిజన పార్టీ అయిన జెఎంఎం తన ఎంపీలు, ఎమ్మెల్యేలతో శనివారం సమావేశమైంది. కాంగ్రెస్ సారథ్యంలోని యుపిఎలో భాగస్వామ్య పక్షమైన జెఎంఎం ఆ కూటమితోనే జార్ఖండ్‌లో అధికారంలో ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News