Wednesday, January 22, 2025

జనం మనిషి ముర్మూ

- Advertisement -
- Advertisement -

Draupadi Murmu met by Prime Minister Modi

 

కలిసి అభినందించిన ప్రధాని
నేడు ఎన్‌డిఎ అభ్యర్థి నామినేషన్
ప్రధాని ఇతర నేతల మద్దతు ప్రతిపాదనలు

న్యూఢిల్లీ : అధికార ఎన్‌డిఎ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్మూను ప్రధాని నరేంద్ర మోడీ గురువారం ఇక్కడ కలిశారు. పుష్ఫగుచ్ఛం ఉంచి అభినందించారు. శుక్రవారం ముర్మూ తమ నామినేషన్ దాఖలు చేస్తారు. ఆమె అభ్యర్థిత్వం పట్ల దేశవ్యాప్తంగా అన్ని వర్గాల నుంచి ప్రశంసలు వెలువడ్డాయని ఆ తరువాత ప్రధాని మోడీ ట్వీటు వెలువరించారు. అట్టడుగు స్థాయి ప్రజల సమస్యల పట్ల ఆమెకు మంచి అవగావహన ఉంది. వాస్తవికతలను గుర్తిస్తారు. అందుకు అనుగుణంగానే నడిచే వ్యహారశైలిని సంతరించుకున్నారని ప్రధాని కొనియాడారు. ప్రధాని మోడీ ప్రతిపాదించనుండటంతో ముర్మూ తమ నిమానేషన్ పత్రాలను సమర్పించేందుకు సిద్ధమయ్యారు. భారత రాష్ట్రపతి ఎన్నికలు వచ్చే నెల 18వ తేదీన జరుగుతాయి. ఓట్ల లెక్కింపు వచ్చే నెల 21న జరుగుతుంది. నామినేషన్ పత్రాల దాఖలుకు చివరి తేదీ ఈ నెల 29 . నామినేషన్ దాఖలుకు ముర్మూ గురువారమే దేశ రాజధానికి చేరారు. ఒడిషాకు చెందిన 64 ఎండ్ల గిరిజన మహిళ ముర్మూ గతంలో జార్ఖండ్ గవర్నర్‌గా కూడా ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News