Monday, December 23, 2024

అభ్యర్థులు ఖరారు.. పోరు జరూరు!

- Advertisement -
- Advertisement -

ఎన్‌డిఎ అభ్యర్థి ద్రౌపది ముర్ము

బిజెపి పార్లమెంటరీ బోర్డు భేటీ అనంతరం ప్రకటించిన జెపి నడ్డా
తొలిసారి గిరిజన మహిళ రాష్ట్రపతయ్యే ఛాన్స్
గతంలో జార్ఖండ్ గవర్నర్‌గా పని చేసిన ముర్ము
ఒడిశా మంత్రిగా కూడా అనుభవం

విపక్షాల నుంచి యశ్వంత్

ఎన్‌సిపి అధినేత పవార్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఏకగ్రీవ ఆమోదం
27న నామినేషన్ వేయనున్న సిన్హా
22 పార్టీల నుంచి మద్దతు
ఐఎఎస్ నుంచి ఎదిగి వచ్చిన నేత

న్యూఢిల్లీ: రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్‌డిఎ అభ్యర్థిగా జార్ఖండ్ మాజీ గవర్నర్ ద్రౌపది ముర్మును ఖరారు చేశారు. ఢిల్లీలో మంగళవారం సా యంత్రం రాష్ట్రపతి అభ్యర్థిని ఎంపిక చేయడం కోసం జరిగిన బిజెపి పార్లమెంటరీ బోర్డు సమావేశం అనంతరం పార్టీ అధ్యక్షుడు జెపి నడ్డా ఈ విషయాన్ని ప్రకటించారు. ప్రధాని నరేంద్ర మోడీ, పార్టీ అధ్యక్షుడు జెపి నడ్డా, కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, అమిత్ షా. నితిన్ గడ్కరీ తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యా రు. సమావేశంలో దాదాపు 20 మంది పేర్లను పరిశీలించిన అనంతరం ద్రౌపది ముర్ము పేరును ఖరారు చేసినట్లు తెలుస్తోంది. అనేక మంది పేర్లు ప్రస్తావనకు వచ్చినప్పటికీ రాష్ట్రపతిగా ఎస్‌టి మహిళను చేయాలని నిర్ణయించినట్లు నడ్డా తెలిపారు. ద్రౌపది ముర్ము విశేష ప్రతిభా శాలి అని, వివాద రహితురాలని చెప్పారు. మంత్రిగా, గవర్నర్‌గా ఆమె రా ణించారన్నారు. ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా మాజీ కేం ద్ర మంత్రి యశ్వంత్ సిన్హా పేరును ప్రకటించిన కొద్ది గంటలకే అధికార ఎన్‌డిఎ కూటమి అభ్యర్థిగా ద్రౌపది ముర్మును ఎంపిక చేయ డం గమనార్హం. రాష్ట్రపతి పదవికి ఒక ఆదివాసీ మహిళను ఎంపిక చేయ డం ఇదే మొ దటి సారి. ఒక వేళ ఎన్నికయితే 64 ఏళ్ల ముర్ము రాష్ట్రపతిగా ఎన్నికయిన తొలి గిరిజన మహిళ అవుతారు.

ఒడిశాకు చెందిన ద్రౌపది ముర్ము గతంలో జార్ఖండ్ గవర్నర్‌గా పని చేశారు. గవర్నర్‌గా అయిదేళ్ల పదవీ కాలం పూర్తి చేసుకున్న ద్రౌపది ముర్ము 2000సంవత్సరంలో రాయ్ రంగాపూర్ ఎంఎల్‌ఎగా గెలిచారు. రాష్ట్ర బిజెపి ఎస్‌టి శాఖ అధ్యక్షురాలిగా పని చేశారు. ఒడిశా రవాణా శాఖ మంత్రిగా కూడా ఆమె పని చేశారు. రాజకీయాల్లోకి రావడానికి ముందు ఆమె టీచర్‌గా పని చేశారు. ఒడిశాలోని మయూర్భంజ్ జిల్లా బైడపోసిలో ద్రైపది ముర్ము జన్మించారు. ముర్ము భర్త శ్యామ్‌చరణ్ ముర్ము. వీరికి ఇద్దరు కుమారులు,ఒక కుమార్తె ఉన్నారు. అంతకు ముందు మంగళవారం మధ్యాహ్నం బిజెపి అధ్యక్షుడు నడ్డా, కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, అమిత్ షాలు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు నివాసానికి వెళ్లి ఆయనతో దాదాపు 50 నిమిషాలు చర్చించారు. బిజెపి పార్లమెంటరీ బోర్డు కీలక సమావేశానికి ముందు ఈ భేటీ జరగడంతో వెంకయ్య నాయుడినే ఎన్‌డిఎ అభ్యర్థిగా ఎంపిక చేయవచ్చంటూ వార్తలు కూడా వచ్చాయి. అయితే చివరికి ద్రౌపది ముర్ము వైపే బిజెపి మొగ్గు చూపింది.

ఆమెనే ఎందుకు?

వాస్తవానికి ద్రౌపది ముర్ము కిందటి సారే రాష్ట్రపతి కావలసింది. అయితే చివరి క్షణంలో బిజెపి నేతలు రామ్‌నాథ్ కోవింద్ పేరుకు మద్దతు తెలపడంతో ముర్ముకు ఆ అవకాశం దక్కలేదు. చదువు తర్వాత కొంత కాలం ప్రభుత్వ ఉద్యోగం చేసిన తర్వాత ముర్ము ఉద్యోగానికి గుడ్‌బై చెపి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. బిజెపి, బిజెడి ప్రభుత్వాల్లో రెండు సార్లు మంత్రిగా పని చేశారు. ఒడిశాలో అత్యంత వెనుకబడిన సంతాల్ గిరిజన జాతికి చెందిన ద్రౌపది ముర్మును ఎంపిక చేయడం ద్వారా రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో గిరిజనులను తమ వైపు తిప్పుకోవాలన్నది బిజెపి వ్యూహంగా కనిపిస్తోంది. అంతేకాదు ఒక మహిళను రాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక చేయడంతో ఒక దెబ్బకు రెండు పిట్టల్ని కొట్టినట్లవుతుంది. ఇటు గిరిజన వర్గానికి అవకాశం కల్పించడంతో పాటుగా అటు మహిళకు అవకాశం ఇచ్చిఆ రెండు వర్గాల ఓటు బ్యాంక్‌ను తమ వైపు తిప్పుకోవడం బిజెపి ఆలోచనగా కనిపిస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News