Monday, December 23, 2024

ఢిల్లీ చేరుకున్న ద్రౌపదీ ముర్మూ

- Advertisement -
- Advertisement -

ఢిల్లీ: ఎన్‌డిఎ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపదీ ముర్మూ ఢిల్లీ చేరుకున్నారు. ముర్మూకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, గజేంద్ర సింగ్, ఇతర నేతలు స్వాగతం పలికారు. ఢిల్లీలోని ఒడిశా సదన్‌లో ద్రౌపదీ బస చేయనున్నారు. నామినేషన్ వేసే వరకు ముర్మూకు సహాయకారిగా కిషన్ రెడ్డి ఉండనున్నారు. ముర్మూ నామినేషన్‌కు ప్రహ్లాద్ జోషి నివాసంలో ఏర్పాట్లు చేయనున్నారు. ముర్మూ నామినేషన్‌పై ప్రధాని నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షా, ఉత్తరాఖండ, యుపి సిఎంలు, కేంద్రమంత్రులు సంతకాలు చేయనున్నారు. రేపు ఉదయం 10.30 గంటలకు రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపదీ ముర్మూ నామినేషన్ వేయనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News