రాహుల్ ద్రవిడ్
న్యూఢిల్లీ: గతంలో తాను భారత-ఎ జట్టుకు కోచ్‌గా వ్యవహరించినప్పుడూ ప్రతి క్రికెటర్‌కి అవకాశం ఇచ్చేవాడినని ఎన్‌సిఎ చీఫ్ రాహుల్ ద్రవిడ్ పేర్కొన్నాడు. సిరీస్‌కు ఎంపికైన ఆటగాడికి ఒక్కసారైనా తుది జట్టులో ఆడే అవకాశం కల్పించేవాడినని తెలిపాడు. దీంతో సిరీస్‌కు ఎంపికైన ఆటగాళ్లలో ఆత్మవిశ్వాసం తొణికిసలాడేదన్నాడు. ఇక అందరికీ అవకాశం ఇస్తానని క్రికెటర్లకు ముందే హామీ ఇచ్చేవాడినని, ఆ మాటను నిలబెట్టుకునేందుకు కృషి చేసేవాడినని ద్రవిడ్ వివరించాడు. సిరీస్‌కు ఎంపికైనా ఆటగాళ్లలో అందరికీ అవకాశం ఇచ్చి వారి ఆత్మవిశ్వాసం సడలకుండా ప్రయత్నించేవాడినని తెలిపాడు. ఇక సిరీస్‌కు ఎంపికై మ్యాచుల్లో ఆడే అవకాశం దొరక్కపోతే బాధ ఎలా ఉంటుందో తనకు అనుభవ పూర్వకంగా తెలుసని ద్రవిడ్ పేర్కొన్నాడు. దీంతో ఆటగాళ్లకు అలాంటి బాధ ఎదురు కాకుండా తాను జాగ్రత్తలు తీసుకునే వాడినన్నాడు. ఇక శ్రీలంక సిరీస్‌లో తనను ప్రధాన కోచ్‌గా ఎంపిక చేయడాన్ని గర్వంగా భావిస్తున్నట్టు చెప్పాడు. తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టేందుకు శాయశక్తుల ప్రయత్నిస్తానని ద్రవిడ్ హామీ ఇచ్చాడు.