Monday, December 23, 2024

రాష్ట్రంలో ద్రావిడ దేశం తెలంగాణ శాఖను ప్రారంభిస్తాం

- Advertisement -
- Advertisement -
ద్రావిడ దేశం అధ్యక్షులు ఒంటెరు కృష్ణారావు

హైదరాబాద్: బడుగు బలహీన వర్గాలకు చేయూతనందించేందుకు వారికి న్యాయంగా రావలసిన అన్ని సదుపాయాలను అందించాలని ధృడ సంకల్పంతో ద్రావిడ దేశం కృషి చేస్తుందని ఆసంస్థ అధ్యక్షులు వంటెరు కృష్ణారావు తెలిపారు. రాష్ట్రంలో ద్రావిడ దేశం విభాగాన్ని త్వరలోప్రారంభించనున్నట్లు తెలిపారు. దీంతో పాటు దక్షిణ భారత దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ తమ శాఖలను విస్తరించనున్నట్లు పేర్కొన్నారు. శనివారం హైదరాబాదులో మాజీ జాతీయ బిసి కమిషన్ చైర్మన్ జస్టిస్ ఈశ్వరయ్య, తమిళనాడు డిఎంకె ఎంపి పి.విల్సన్, బీహార్ మాజీముఖ్యమంత్రి బిపి మండల్ మనవడు ప్రొఫెసర్ సూరజ్ మండల్, శ్రీనివాస యాదవ్‌తో కలిసి దక్షిణ భారతదేశంలో ఎస్సీ ,ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల ప్రజల హక్కుల కోసం చేయాల్సిన ప్రణాళికల గురించి చర్చించినట్లు చెప్పారు. రాష్ట్రంలోని అన్నిజిల్లాలలో ద్రావిడ దేశం శాఖలలో అన్ని వర్గాల వారిని భాగస్వామ్యం ప్రజాసేవ చేయడానికి జస్టిస్ ఈశ్వరయ్యను కోరగా వారు సానుకూలంగా స్పందించారని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News