Wednesday, January 22, 2025

ప్లాస్టిక్ సహాయంతో ఎటిఎంలో డబ్బులు డ్రా… నయా మోసం

- Advertisement -
- Advertisement -

ఆదిలాబాద్: ఎటిఎంలో డబ్బులు బయటకు వచ్చే వద్ద దుండగులు ప్లాస్టిక్ పెట్టి ఐదు వేల రూపాయల డ్రా చేసిన సంఘటన ఆదిలాబాద్ జిల్లా మావల మండలంలోని దస్నాపూర్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం….  సతీష్ దేశ్‌పాండే అనే వ్యక్తి ఎంటిఎం వెళ్లి ఐదు వేలు డ్రా చేయాలలకున్నాడు. ఎటిఎంలో కార్డు పెట్టి ఐదు వేల రూపాయలు కోసం ఫిన్ కొట్టాడు. డబ్బులు బయటకు రాలేదు కానీ డ్రా చేసినట్టు సందేశం రావడంతో షాక్ అయ్యాడు. వెంటనే బ్యాంకు మేనేజర్, మావల పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఎటిఎంలోని నిఘా కెమెరాను పోలీసులు పరిశీలించారు. ముగ్గురు దుండగులు ప్లాస్టిక్ అంటించినట్లుగా గుర్తించారు. దేశ్‌పాండే ఎటిఎం నుంచి బయటకు వెళ్లగానే అంటించిన ప్లాస్టిక్ ను తీసి దుండగులు డబ్బులు తీసుకున్నారు. గుర్తు తెలియని ముగ్గురు దుండగులపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News