Sunday, April 27, 2025

ఆకాశ్ ఎన్‌జి క్షిపణి ప్రయోగం విజయవంతం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ఒడిశా తీరం నుంచి నవ తరం ఆకాశ్-ఎన్‌జి క్షిపణిని భారత్ శుక్రవారం విజయవంతంగా పరీక్షించింది. దీనితో మన దేశ సైనిక సత్తాకు మరింత పదును చేకూరినట్లు అయింది. ఒడిశా చాందీపూర్‌లోని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుంచి ఉదయం 10.30 గంటలకు క్షిపణిని పరీక్షించినట్లు రక్షణ మంత్రిత్వశాఖ వెల్లడించింది. ఆకాశ్-ఎన్‌జి క్షిపణి శ్రేణి సుమారు 80 కిలో మీటర్లు.

‘క్షిపణి పరీక్ష సమయంలో లక్షాన్ని ఆయుధ వ్యవస్థ విజయవంతంగా అడ్డుకుని ధ్వంసం చేసింది’ అని రక్షణ మంత్రిత్వశాఖ ఒక ప్రకటనలో తెలియజేసింది. ‘క్షిపణి పరీక్షను డిఆర్‌డిఒ, భారత వైమానిక దళం, భారత్ డైనమిక్స్ లిమిటెడ్, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ సీనియర్ అధికారులు వీక్షించారు’ అని మంత్రిత్వశాఖ తన ప్రకటనలో తెలియజేసింది. విజయవంతంగా క్షిపణి పరీక్ష నిర్వహించినందుకు సదరు ప్రభుత్వ రంగ సంస్థలను రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రశంసించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News