- Advertisement -
న్యూఢిల్లీ : రాడార్‌తో పనిచేసే శత్రువుల క్షిపణులను విధ్వంసం చేయగల అత్యంత ఆధునిక చాఫ్ టెక్నాలజీని డిఆర్‌డిఒ అభివృద్ధి చేసింది. దీనివల్ల భారత వైమానిక యుద్ధ విమానాలకు శత్రు క్షిపణుల నుంచి రక్షణ కలుగుతుంది. ఈమేరకు అన్ని పరీక్షలు పూర్తయిన తరువాత ఈ సాంకేతికతను అమలు లోకి తెచ్చారు. రక్షణ మంత్రి రాజ్‌నాధ్ సింగ్ గురువారం డిఆర్‌డిఒ కృషిని అభినందించారు. స్వదేశీ పరిజ్ఞానంతో ఆత్మనిర్భర్ భారత్ దిశగా డిఆర్‌డిఒ ముందుకు సాగుతోందని పేర్కొన్నారు.
DRDO develops advanced chaff technology for IAF jets
- Advertisement -