Sunday, December 22, 2024

పొలాల్లో కుప్పకూలిన డీఆర్‌డీవో డ్రోన్

- Advertisement -
- Advertisement -

బెంగళూరు : రక్షణ పరిశోధనాభివృద్ధి సంస్థ (డీఆర్‌డివొ)కు చెందిన డ్రోన్ ఆదివారం కర్ణాటకలో కుప్పకూలింది. చిత్రదుర్గ జిల్లా హరియూర్ తాలూకా లోని వడ్డికెరె గ్రామం లోని పొలాల్లో డ్రోన్ కూలిపోయినట్టు రక్షణ శాఖ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం దీనికి సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. కూలిన డ్రోన్‌ను చూసేందుకు స్థానికులు పెద్ద ఎత్తున ప్రమాద స్థలానికి చేరుకున్నారు. గత కొంత కాలంగా డీఆర్‌డీవో యూఏవీల అభివృద్ధిపై పరిశోధనలు చేస్తోంది. తపస్ పేరుతో రూపొందిస్తున్న ఈ డ్రోన్‌ను ఆదివారం ఉదయం డీఆర్‌డీవో పరీక్షిస్తుండగా కూలిపోయినట్టు రక్షణ శాఖ అధికారులు తెలిపారు. ఈ ప్రమాదం గురించి రక్షణ శాఖకు సమాచారం అందించినట్టు వెల్లడించారు. డ్రోన్ కూలిపోవడానికి కారణాలను విశ్లేషిస్తున్నట్టు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News