న్యూఢిల్లీ : కరోనా నియంత్రణకు డిఆర్‌డివొ తయారు చేసిన పొడి రూపం లోని ఔషధం ఎలా వాడాలో తెలియచేసే మార్గదర్శకాలను డిఆర్‌డిఒ విడుదల చేసింది. వైద్యుల పర్యవేక్షణ లోనే ఈ ఔషధాన్ని వాడాలని, స్పష్టం చేసింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కరోనా రోగులకు ఇస్తున్న చికిత్సకు అనుబంధంగా ఈ ఔషధాన్ని అత్యవసర వినియోగానికి డిఆర్‌డివొ అనుమతించింది. 1. ఒక మోస్తరు నుంచి తీవ్ర కొవిడ్ లక్షణాలతో బాధపడుతున్న రోగులకు సాధ్యమైనంత త్వరగా డాక్టర్లు ఈ మందును ప్రిస్ర్కైబ్ చేస్తే బాగుంటుంది. గరిష్ఠంగ పది రోజుల పాటు దీనిని వాడొచ్చు. 2. నియంత్రణ లేని డయాబెటిస్, తీవ్రమైన గుండెజబ్బులు, ఎఆర్‌డిఎస్ వంటి వ్యాధులతో బాధపడే వారిపై ఈ ఔషధాన్ని ఇంకా పూర్తిగా పరీక్షించి చూడలేదు. అందువల్ల కాస్త ముందు జాగ్రత్త అవసరం. 3. ఈ ఔషధాన్ని గర్భిణులు, బాలింతలు, 18 ఏళ్ల లోపు రోగులకు ఇవ్వకూడదు. 4. ఈ ఔషధం సరఫరా చేయాలని హైదరాబాద్ లోని డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్‌కు 2dg@drreddys.comకు మెయిల్ చేయవచ్చు. ఈ ఔషధం 2 డిజి సాచెట్ ధర రూ.990 గా రెడ్డీస్ ల్యాబ్ నిర్ణయించింది. చికిత్సలో ఒక్కొక్కరికి ఐదు నుంచి పది సాచెట్లు అవసరం. చికిత్సకు ఒక్కొక్కరికి రూ.5 వేల నుంచి రూ.10 వేలు అవుతుంది.