Monday, December 16, 2024

వాయుసేనకు చిచ్చరపిడుగు

- Advertisement -
- Advertisement -

India’s 1st long-range 1 ton guided bomb test fired

ఎల్‌ఆర్ బాంబు గురిగా బరికి

బాలాసోర్ (ఒడిషా) : యుద్ధ విమానాల నుంచి ప్రయోగించే సుదూర లక్ష్యపు బాంబు (ఎల్‌ఆర్ బాంబు)ను విజయవంతంగా పరీక్షించారు. రక్షణ రంగానికి చెందిన డిఆర్‌డిఒ, భారత వైమానిక దళం (ఐఎఎఫ్) బృందాలు శుక్రవారం దీనిని వాయుసేన యుద్ధ విమానం నుంచి పరీక్షించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. హైదరాబాద్‌లోని బాలాపూర్ ప్రాంతంలో ఉన్న ఇమారత్ రిసర్చ్ సెంటర్‌లో దీని రూపకల్పన, తయారీ జరిగింది. పలు డిఆర్‌డిఒ లాబ్‌ల సాంకేతిక సమన్వయం ఇమిడి ఉంది. ఇది పూర్తిగా స్వదేశీ నిర్మిత యుద్ధకాలపు వాడకపు బాంబుగా నిలుస్తుంది. ఐఎఎఫ్ ఫైటర్ విమానం నుంచి ఈ శక్తివంతమైన బాంబును నిర్థిష్ట రీతిలోని లక్షాన్ని ఎంచుకుని జార విడిచారు. ఇది నిర్ణీత పరిమితులకు అనుగుణంగా పనిచేసినట్లు నిర్థారించారు. దీనితో ఎల్‌ఆర్ బాంబు విజయవంతం అయినట్లు రక్షణ అధికారులు ప్రకటనలో తెలిపారు. ఈ ప్రయోగ లక్షాలను ముందుగా ఖరారు చేసుకున్నారు.

తరువాతి దశలో ఇవన్నీ కూడా సవ్యంగా సాగినట్లు నిర్థారించుకున్నట్లు ప్రకటనలో తెలిపారు. ఎంచుకునే లక్షాన్ని ఈ బాంబు ద్వారా ఛేదించేందుకు అత్యంత అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుకున్నారు. దూర ప్రాంతంలోని శత్రు స్థావరాన్ని సరిగ్గా పసికట్టేందుకు ఎలక్ట్రిక్ ఆప్టికల్ ట్రాకింగ్ సిస్టమ్, టెలిమిట్రీ, రాడార్ వంటి పలు సాంకేతిక రేంజ్ సెన్సార్లను వాడుకున్నట్లు వివరించారు. ఈ పరీక్ష విజయవంతం కావడం పట్ల రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ హర్షం వ్యక్తం చేశారు. డిఆర్‌డిఒ, ఐఎఎఫ్ ఇతర సంబంధిత బృందాల సమన్వయ కృషిని అభినందించారు. ఈ సమగ్ర బాంబు భారతీయ వాయుసేన శక్తిని మరింత బలోపేతం చేసి తీరుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇటువంటి శ్రేణి రక్షణ వ్యవస్థలను దేశీయంగా రూపొందించుకోవడంలో ఈ పరీక్ష తరువాతి విజయవంత ఘట్టం ఓ మైలురాయి అయిందని డిడిఆర్ అండ్ డి సెక్రెటరీ, డిఆర్‌డిఒ ఛైర్మన్ జి సతీష్ రెడ్డి స్పందించారు. సంబంధిత సిబ్బందిని అభినందించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News