- Advertisement -
బాలసోర్(ఒడిషా): ఒడిషా తీరానికి సమీపంలోని రక్షణ కేంద్రం నుంచి అణు సామర్ధంతో కూడిన అగ్ని ప్రైమ్ క్షిపణి పాటవ పరీక్షను భారత్ సోమవారం విజయవంతంగా నిర్వహించింది. భూమి నుంచి భూమ్మీద నుండి భూమ్మీది లక్ష్యాలను ఛేదించగల ఈ బాలిస్టిక్ క్షిపణి వెయ్యి నుంచి 2 వేల కిలోమీటర్ల దూరం ప్రయాణించగలదు. ఒడిషాలోని అబ్దుల్ కలామ్ దీవి నుంచి ఉదయం 10.55 గంటలకు మొబైల్ లాంఛర్ ద్వారా ఈ క్షిపణి ప్రయోగ పరీక్ష నిర్వహించినట్లు డిఆర్డిఓ ఒక ప్రకటనలో తెలిపింది.
DRDO successfully tested Agni Prime Missile
- Advertisement -