బాలాసోర్: దేశీయంగా అభివృద్ధి పరచిన హైస్పీడ్ ఎక్స్‌పెండిబుల్ ఏరియల్ టార్గెట్ ‘అభ్యాస్’ను శుక్రవారం ఒడిశా తీరంలోని చాందీపూర్ ఇంటిగ్రేటెడ్ టెస్టు రేంజ్‌నుంచి విజయవంతంగా ప్రయోగించి పరీక్షించారు. వివిధ క్షిపణి వ్యవస్థల పనితీరును అంచనా వేయడం కోసం ఏరియల్ టార్గెట్‌గా దీన్ని ఉపయోగించవచ్చు.ఈ టార్గెట్ విమానం పని తీరును టెలిమెట్రీ, రాడార్లు, ఎలక్ట్రో ఆప్టికల్ ట్రాకింగ్ సిస్టం లాంటి వివిధ సెన్సర్ల ద్వారా పర్యవేక్షించినట్లు దీన్ని రూపొందించిన డిఆర్‌డిఓ వర్గాలు తెలిపాయి. పరీక్షను విజయవంతంగా నిర్వహించినందుకు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ డిఆర్‌డిఓ శాస్త్రజ్ఞులను అభినందించారు. బెంగళూరులోని డిఆర్‌డిఓకు చెందిన ఏరోనాటికల్ డెవలప్‌మెంట్ ఎస్టాబ్లిష్‌మెంట్‌లో దీన్ని అభివృద్ధి చేశారు. శబ్ద వేగానికన్నా తక్కువ వేగంతో ఎక్కువ సమయం ప్రయాణించడానికి వీలుగా దీనిలో గ్యాస్ టర్బైన్ ఇంజన్‌ను ఏర్పాటు చేశారు.
ఏరియల్ టార్గెట్ వెహికిల్ ‘అభ్యాస్’ ప్రయోగం విజయవంతం
- Advertisement -
- Advertisement -
- Advertisement -