చాందీపూర్ : అభ్యాస్ హై స్పీడ్ ఏరియల్ టార్గెట్‌ను బుధవారం డీఆర్డివొ విజయవంతంగా పరీక్షించింది. ఒడిశా లోని చాందీపూర్‌లో ఉన్న ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజిలో ఈ పరీక్ష జరిగింది. టెస్ట్ ఫ్లయిట్ సందర్భంగా హీట్ ఎయిర్ క్రాఫ్ట్‌ను అతి తక్కువ ఎత్తులో పరీక్షించారు. ఈ పరీక్ష నిర్వహించిన సమయంలో సెన్సార్లు ఆ ఏరియట్ టార్గెట్‌కు చెందిన రేడార్, ఎలక్ట్రికల్ సిస్టమ్‌ను ట్రాక్ చేశాయి. ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ డిఫెన్స్ రీసర్చ్ , డీఆర్డీవోలు సంయుక్తంగా అభ్యాస్ ఎయిర్‌క్రాఫ్ట్‌ను డెవలప్ చేశాయి. ట్విన్ బూస్టర్లతో ఈ ఎయిర్ వెహికల్ పనిచేస్తుంది. అయితే సుదీర్ఘ దూరం ప్రయాణించేందుకు ఆ వాహనంలో గ్యాస్ టర్బైన్ ఇంజిన్‌ను అమర్చారు. ఏరియల్ వెహికల్ పరీక్ష సందర్భంగా రక్షణ మంత్రి రాజ్‌నాధ్ సింగ్ డీఆర్డివొకు అభినందనలు తెలిపారు.
#DRDOforIndia | Strengthening indigenous capabilities, #ABHYAS-HEAT has been successfully flight tested from ITR today. The test demonstrated the performance at low altitude including sustained level & high manoeuvrability. #AtmanirbharDefence@DefenceMinIndia @SpokespersonMoD pic.twitter.com/y6a3SBMAk3
— DRDO (@DRDO_India) June 29, 2022