- Advertisement -
హాజీరా(గుజరాత్): భారత్ తొలి స్వదేశీ తేలికపాటి యుద్ధ ట్యాంక్ ‘జోరావర్’ను ఆవిష్కరించింది. ఎత్తైన యుద్ధ భూముల్లో, అన్ని వాతావరణ పరిస్థితుల్లో ఈ యుద్ధ ట్యాంక్ పనిచేయగలదు. ఈ తేలికపాటి యుద్ధ ట్యాంక్ ను రెండేళ్ల రికార్డు టైమ్ లో భారత్ నిర్మించింది.
డిఆర్ డివో చీఫ్ సమీర్ వి. కామత్ శనివారం హజీరాలోని ఎల్ అండ్ టి ఉత్పత్తి కేంద్రంలో దీని ప్రాజెక్టును సమీక్షించారు. జోర్వార్ హైస్పీడ్ భూతల పరీక్షలను నిర్వహించారు. ఎత్తైన ప్రదేశాలలోనే కాక, అత్యంత వాలు ప్రదేశాలలో కూడా అనకూలంగా మలచుకునే సామర్థ్యం ఈ ట్యాంక్ కు ఉంది. ఇక ఈ ట్యాంక్ ప్రత్యేక ట్రాక్ ఉన్న చెన్నైకు వెళుతుంది. అక్కడ అన్ని పరిస్థితుల్లో పనిచేస్తుందా లేదా అన్నది పరీక్షిస్తారు. ఆ తర్వాత ట్రయల్స్ కోసం దీనిని సైన్యానికి అప్పగిస్తారు.
- Advertisement -