Saturday, December 21, 2024

టీమిండియా ప్రధాన స్పాన్సర్‌గా డ్రీమ్ 11

- Advertisement -
- Advertisement -

ముంబై: టీమిండియా కొత్త స్పాన్సర్‌గా ఫాంటసీ స్పోర్ట్ గేమింగ్ ప్లాట్‌ఫామ్ డ్రీమ్ 11 ఎంపికైంది. గతంలో బైజూస్ సంస్థ టీమిండియా స్పాన్సర్‌గా వ్యవహరించింది. దాని స్థానంలో కొత్తగా డ్రీమ్ 11ను ప్రధాన స్పాన్సర్‌గా భారత క్రికెట్ బోర్డు నియమించింది. ఈ విషయాన్ని బిసిసిఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ, డ్రీమ్ స్పోర్ట్ సహ యజమానికి, సిఒఓ హర్ష్ జైన్ వెల్లడించారు. రానున్న వెస్టిండీస్ సిరీస్‌లో టీమిండియా క్రికెటర్లు డ్రీమ్ 11 లోగోలతో కూడిన జెర్సీలను ధరిస్తారు.

ఈ ఏడాది భారత్ వేదికగా వన్డే ప్రపంచకప్ జరుగనున్న నేపథ్యంలో డ్రీమ్ 11 సంస్థ టీమిండియాకు ప్రధాన స్పాన్సర్‌గా వ్యవహరించేందుకు ముందుకు వచ్చింది. ఇంతకుముందు 2020లో డ్రీమ్ 11 ఐపిఎల్ టైటిల్ స్పాన్సర్‌గా వ్యవహరించింది. తాజాగా టీమిండియాకు కూడా ప్రధాన స్పాన్సర్‌గా ఎంపిక కావడం విశేషం. ఇదిలావుంటే ఇప్పటి వరకు ప్రధాన స్పాన్సర్‌గా వ్యవహరించిన బైజూస్ తప్పుకోవడంతో డ్రీమ్ 11కు ఛాన్స్ లభించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News