చండీగఢ్ విద్యా శాఖ నగరంలోని ప్రభుత్వ పాఠశాల టీచర్లకు.. ఫార్మల్స్, సల్వార్‌కమీజ్ డ్రెస్‌కోడ్‌ను పురుషులు, మహిళా టీచర్లకు విధించింది.‘మహిళా ఉద్యోగినులు చీరలు, సల్వార్ కమీజ్ ధరించాలని, పురుషు ఉద్యోగులు ఫార్మల్ షర్టులు, ప్యాంట్లు ధరించాలని యూనిఫాం స్పెసిఫికేషన్లు తెలుపుతున్నాయి’ అని శనివారం విడుదల చేసిన అధికారిక ప్రకటనలో ఆ విభాగం తెలిపింది. ఉపాధ్యాయులకు డ్రెస్‌కోడ్ విధించిన తొలి కేంద్ర పాలిత ప్రాంతంగా చండీగఢ్ ప్రాధాన్యతను సంతరించుకుంది. ‘ఏకీకృత దుస్తుల నియమావళి సిబ్బందిలో సమానత్వాన్ని ప్రోత్సాహించడమే కాకుండా గర్వకారణం, వృతినైపుణ్యాన్ని కూడా పెంచుతుంది’ అని పంజాబ్ గవర్నర్, చండీగఢ్ అడ్మినిస్ట్రేటర్ గులాబ్ చంద్ కటారియా అన్నారు. వేసవి సెలవుల తర్వాత, స్కూళ్లు తెరుచుకున్నాక డ్రెస్‌కోడ్‌ను ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులకు అమలుచేస్తామని విద్యాశాఖ స్పష్టం చేసింది.
చండీగఢ్‌లో ప్రభుత్వ టీచర్లకు డ్రెస్ కోడ్
- Advertisement -
- Advertisement -
- Advertisement -