Thursday, December 19, 2024

నల్ల దుస్తులతో పార్లమెంట్‌కు విపక్ష ఎంపీలు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : మణిపూర్ హింసాకాండపై ప్రభుత్వ వైఖరికి నిరసన సూచనగా నల్లదుస్తులు ధరించి ప్రతిపక్ష ఇండియా కూటమికి చెందినన ఎంపీలు గురువారం రాజజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికారున్ ఖర్గే చాంబర్‌లో సమావేశమై పార్లమెంట్‌లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు.

మణిపూర్ హింసాకాండపై ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు ఇచ్చిన అవిశ్వాస తీర్మానాన్ని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ఆమోదించి దరిమిలా సభలో మరే ఇతర అంశాన్ని అనుమతించకూడదని ప్రతిపక్ష నాయకులు నిర్ణయానికి వచ్చినట్లు వర్గాలు తెలిపాయి. ఇతర అంశాలను సభలో చేపట్టే ముందుగా అవిశ్వాస తీర్మానాన్ని చర్చకు చేపట్టాల్సి ఉంటుందని ప్రతిపక్ష ఎంపీలు భావిస్తున్నట్లు వారు చెప్పారు.

మణిపూర్‌పై చర్చకు అనుమతించకపోవడం, ప్రధాని నరేంద్ర మోడీ పార్లమెంట్ ఉభయసభలలో ప్రకటన చేయకపోవడానికి నిరసనగా ప్రతిపక్ష ఎంపీలు నల్లదుస్తులు ధరించి పార్లమెంట్‌కు హాజరైనట్లు వర్గాలు తెలిపాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News