Friday, November 22, 2024

నాలాలో పడి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ గల్లంతు

- Advertisement -
- Advertisement -

DRF Risk Team search for Missing Software Engineer Rajinikanth

గాలిస్తున్న డిఆర్‌ఎఫ్ బృందాలు

శనివారం రాత్రి 9గంటల సమయంలో ఇంటి నుంచి బయటికొచ్చిన ఇంజినీర్ గోపిశెట్టి రజినీకాంత్
దారి కనిపించక నాలాలో పడి గల్లంతు
దాదాపు 20గంటలుగా గాలిస్తున్న 15 మంది సభ్యుల డిఆర్‌ఎఫ్ బృందం
ఘటన స్థలిని పరిశీలించి, బాధిత కుటుంబాన్ని మంత్రి సబితా ఇంద్రారెడ్డి

మనతెలంగాణ/హైదరాబాద్‌: నగరంలోని మణికొండలో శనివారం రాత్రి నాలాలో గల్లంతైన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ రజనీకాంత్ కోసం డిఆర్‌ఎఫ్ రిస్కూ బృందాలు గాలింపు చర్యలు చేపడుతున్నాయి. ఈక్రమంలో నాలాలో గల్లంతైన వ్యక్తి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ గోపిశెట్టి రజనీకాంత్‌గా గుర్తించిన పోలీసులు ఘటనా స్థలానికి 50 మీటర్ల దూరంలోనే అతని ఇల్లు ఉన్నట్లు వివరించారు.సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్న రజనీకాంత్ శనివారం రాత్రి 9గంటల సమయంలో ఇంటి నుంచి బయటకొస్తున్న క్రమంలో దారి కనిపించక నాలాలో పడి కొట్టుకుపోయాడు.

కాగా మణికొండలో ఓ వ్యక్తి డ్రైనేజీ పైపులైన్ కోసం తవ్విన గుంతలో రజనీకాంత్ ప్రమాదవశాత్తు పడి గల్లంతైన సమాచారం అందుకున డిఆర్‌ఎఫ్ బృందాలు రంగంలోకి దిగి గాలింపు చేపడుతున్నాయి. ఈక్రమంలో 15మంది సభ్యులు కల డిఆర్‌ఎస్ సిబ్బంది దాదాపు 20 గంటలుగా తూములు వెళ్లి కలిసే చోట గాలింపు చర్యలు చేపట్టారు. ఘటన జరిగిన ప్రాంతానికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న నెక్నాంపూర్ చెరువు వద్ద మరో బృందం గాలిస్తోంది. నీటి ప్రవాహం ఎక్కువ ఉండటంతో అతడు చెరువు వరకూ వెళ్లే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.

మంత్రి సబిత ఇంద్రారెడ్డి పరామర్శ 

సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ గల్లంతైన సమాచారం అందుకున్న మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెంటనే ఘటనాస్థలిని పరిశీలించారు. అనంతరం బాధిత కుంటుంబ సభ్యులను కలిసి పరామర్శించారు. ఈ సందర్భంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ నిర్మాణాల వద్ద జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉందని, మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. గల్లంతైన వ్యక్తి కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయని తెలిపారు. వర్షాకాలంలో ఎక్కడైనా పనులు చేస్తుంటే అక్కడ బారికేట్లు పెట్టాలని అధికారులను సూచిస్తున్నట్లు చెప్పారు. ఈ సంఘటనతో అధికారులను అప్రమత్తత చేస్తున్నట్లు తెలిపారు. అధికారుల నిర్లక్ష్యం గుర్తిస్తే చర్యలు తీసుకుంటామని వివరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News