Wednesday, January 22, 2025

వర్షాకాలానికి సన్నద్ధమవుతున్న డిఆర్‌ఎఫ్ బృందాలు

- Advertisement -
- Advertisement -

వర్షాకాలానికి సన్నద్ధమవుతున్న డిఆర్‌ఎఫ్ బృందాలు
సిటీ బ్యూరో : వర్షాకాలం ప్రవేశిస్తున్న నేపథ్యంలో డిఆర్‌ఎఫ్ బృందాలను సన్నద్దం చేస్తున్నట్లు జిహెచ్‌ఎంసి ఎన్‌ఫోర్స్‌మెంట్, విజిలెన్స్ అండ్ డిజాస్టార్ మేనేజ్‌మెంట్ డైరెక్టర్ ఎన్.ప్రకాష్ రెడ్డి తెలిపారు. మరో వారం పది రోజుల్లో వర్షాలు ప్రారంభం కానునుండడంతో ముందస్తు ప్రణాళికలను ఆయన గురువారం మీడియాకు వివరించారు. వర్షాల కారణంగా నగరంలో ఎప్పుడు ఏలాంటి విపత్తు సంభవించినా ఈ ఆపద కాలంలో ప్రజలకు తక్షణ సహాయక చర్యలను అందించేందుకు గ్రేటర్ పరిధిలో 27 డిఆర్‌ఎఫ్ బృందాలు పని చేస్తున్నాయని తెలిపారు. ఈ ఏడాది కొత్తగా మరో 3 బృందాలను ఏర్పాటుచేస్తున్నామని దీంతో ప్రతి ఒక సర్కిల్‌కు ఒక బృందం చోప్పున పూర్తి స్థాయిలో పని చేస్తాయని వెల్లడించారు.

పూర్తి శిక్షణతో అన్ని అంశాలలో నిష్ణాతులైన 5 సిబ్బందితో కూడిన డిఆర్‌ఎఫ్ బృందాలను ఏర్పాటు చేయడమే కాకుండా అత్యాధునిక పనిముట్లు , యంత్రాలతో కూడిన వాహనాలను సమకూర్చామన్నారు. వరదలు మొదల్కోని భూకంపాలు, భవనాలు కూలిపోవడం, చెట్టు పడిపోవడం ఏలాంటి విపత్తు సంభవించినా సహాయ చర్యలను అందించే విధంగా డిఆర్‌ఎఫ్ బృందాలను తీర్చిదిద్దినట్లు చెప్పారు. అంతేకాకుండా అత్యవసర పరిస్థితుల్లో క్షతగ్రాతులకు వైద్య సేవలను అందించేందుకు తక్షణమే ఆసుపత్రులకు తరలించేందుకు పూర్తి వైద్య సౌకర్యాలతో 6జోన్లలో ఒకోక్కటి చోప్పున 6 ప్రత్యేకఅంబులెన్స్‌లను అందుబాటులోకి తీసుకువస్తున్నమన్నారు.

గ్రేటర్ వ్యాప్తంగా సుమారు 50 భారీ వాటర్ స్టాగినేట్ పాయింట్లను గుర్తించామని, మరో వంద వరకు చిన్న చిన్న పాయింట్లను కూడా గుర్తించడం జరిగిందని ఆయన తెలిపారు. గతంలో చోటు చేసుకున్న ఘటనలు, ప్రమాదాలను దృష్టిలో పెట్టుకుని ఈ ఏడాది సైబరాబాద్‌కు 3, రాచకొండ 3, హైదరాబాద్ కమిషరేట్లకు 7 మొత్తం 10 డిఆర్‌ఎఫ్ బృందాలను కేటాయించినట్లు ప్రకాశ్‌రెడ్డి వెల్లడించారు.
ప్రాంతాల వారిగా కేటాయించిన డిఆర్‌ఎఫ్ బృందాలు
గత వర్షకాలం అనుభవాలను దృష్టిలో పెట్టుకుని వరద ముంపు ప్రభావిత ప్రాంతాలకు డిఆర్‌ఎఫ్ బృందాలను కేటాయించారు. ఈ బృందాలు ఆయా ప్రాంతాల్లో అందుబాటులో ఉండనున్నాయి. రాజ్ భవన్, జీవీకే మాల్, ఫతుల్లాగూడ, గుడిమల్కాపూర్,కూకట్ పల్లి జంక్షన్, మలక్ పేట, ఉప్పల్, మెట్టుగూడ, శిల్పారామం,సీఎం క్యాంప్ ఆఫీసు, షేక్ పేట, చంపాపేట, మియాపూర్ మెట్రో స్టేషన్, ఎల్బీనగర్, ఫతుల్లాగూడ, ఈసీఐఎల్, బయోడైవర్శిటీ పార్కు, చాంద్రాయణగుట్ట, గచ్చిబౌలీ స్టేడియం, సుజన ఫోరం మాల్, సుచిత్ర, కాచిగూడ, సెక్రటేరియట్,వనస్థలిపురం, మెహిదీపట్నంలకు బృందాలను కేటాయించారు. త్వరలో అందుబాటులోకి రానున్న మరో 3 బృందాలను అవసరమైన చోటికి చ కేటాయించనున్నట్లు తెలిపారు.డిఆర్‌ఎఫ్ బృందాలు అను నిత్యం 24 గంటలు పని చేస్తాయని విపత్తుల సమయంలో ఏలాంటి అవసరమొచ్చినా ఫోన్ నంబర్ 0402955500 సెల్ నంబర్ 9000113667కు కాల్ చేస్తే చాలు తక్షణమే సహాయక చర్యలు అందిస్తారని వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News