అటు ఎండు మిర్చి, ఇటు నూనె ధరల ఘాటు
పచ్చళ్ల ప్రియుల పరేషాన్
ఆకాశాన్నంటుతోన్న ఎండుమిర్చి ధర
భగ్గుమంటున్న నూనె ధరలు
వేరుశెనగ ఆయిల్ కిలో రూ.200పైమాటే
హైదరాబాద్: చాలా మందికి పచ్చళ్లు అంటే ప్రాణం. వాటిని ఇష్టంగా తింటారు. వాటి రుచి అలాంటిది మరి. కొంతమందికి పచ్చడి మెతుకులే ప్రాణం. ఎన్ని కూరలు ఉన్నా సరే.. అంచుకి పచ్చళ్లు ఉండాల్సిందే. ఆఖరికి బిర్యానీ ఉన్నా సరే పచ్చడితోనే ఇష్టంగా లాగించేస్తారు. తెలుగువాళ్లు కమ్మనైన విందు భోజనంలో పచ్చళ్లకు ప్రథమ తాంబూళం అని చెప్పక తప్పదు. అటువంటి పచ్చళ్లకు ఎసరు వచ్చే పరిస్థితి కన్పిస్తోంది. పెరిగిన మిర్చి ధరల ఘాటుతో సామాన్య, మధ్య తరగతి జనాలు పచ్చళ్లకు దూరమయ్యే పరిస్థితి కన్పిస్తోంది. ఎన్నడూ లేనంతగా పచ్చళ్లకు.. మరీ ముఖ్యంగా ఆకవాయకు ఉపయోగించే ఎండు మిర్చి ధరలు ఆకాశాన్నంటడంతో ఈ ఏడాది పచ్చళ్లు పెట్టుకోవడం పరేషాన్‌గా మారేలా కన్పిస్తోంది.
మిర్చి ధరలు విపరీతంగా పెరగడం, ముఖ్యంగా పచ్చడి ఆవకాయకు ఉపయోగించే మిర్చి రకం ధర మరీ విడ్డూరంగా రూ.450 ధర పలకుతుండటంతో మధ్యతరగతి వర్గాల ప్రజలు పచ్చళ్ల వైపు చూడాలంటేనే భయపడే పరిస్థితులు కన్పిస్తున్నాయి. అయితే సింగిల్ పట్టీ రకం క్వింటాల్ రూ.42.300 ధర పలుకుతోంది. పచ్చళ్లు అంటే ఇప్పటి వరకూ అందరికీ అందుబాటులో ఉండేదన్న మాట. కానీ, పెరిగిన మిర్చి రేటు సగటు జీవికి ఘటెక్కిస్తోంది. అవకాయ పచ్చళ్లకు ఉపయోగించే దేశీ, సనం, బైడగి (కడ్డి), తేజస్విని, జ్వలా రకం మిర్చి ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. ప్రస్తుతం వీటి ధర కిలో రూ.400 నుంచి 450 పలుకుతుండగా.. ఈ నెలాఖరు నాటికి కిలో రూ.500 వరకూ ధర పలికే అవకాశం ఉంటుందని మార్కెట్ వర్గాలంటున్నాయి.
పైపైకి ఎగబాకుతున్న నూనె ధరలు..
ఈ ఏడాది పచ్చళ్లపై అన్ని ప్రతికూల పవనాలే వీస్తున్నాయి. ఒక పక్క మిర్చి ధర పెరిగిపోవడం అటుంచితే.. మరో వంక ఇప్పటికే నూనె ధరలు కొండెక్కి కూర్చున్నాయి. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం పుణ్యమా అని వంట నూనెల ధరలు అమాంతం పెరిగిపోయాయి. రూ.145 నుంచి 160 మధ్యలో ఉండే నూనెల ధరలు 20 రోజులుగా పెరిగిపోయాయి. లీటర్ వేరుశనగ నూనె రూ.200 వరకూ పలుకుతోంది. ఒక పక్క ఎండు మిర్చి, మరో వంక నూనె ధరలు పెరిగిపోవడంతో ఈ ఏడాది పచ్చళ్లు పెట్టుకునేందుకు సామాన్య జనం బెంబేలెత్తిపోతున్నారు.
వేసవి పచ్చళ్ల సీజన్..
వేసవి వచ్చిందంటే చాలు.. సగటు జీవి పచ్చళ్లకు బడ్జెట్ లెక్క లు వేసుకుంటాడు. రెండు, మూడు రకాల పచ్చళ్లు కోసం తగి న ఏర్పాట్లు చేసుకుంటాడు. సాధారణంగా చాలామంది ఆవకాయ, మాగాయ పచ్చళ్లకు ప్రయారిటీ ఇస్తుంటారు. సాధారణ రోజుల్లో మాత్రం పండు మిర్చి, ఉసిరి, చింత, టమాటా రకం పచ్చళ్లు పెట్టుకునేందుకు ప్రాముఖ్యత ఇస్తుంటారు. ఇం దు కోసం రూ.100-0 బడ్జెట్‌లో కేటాయించుకుంటారు. ఈసా రి పరిస్థితి చూస్తే అది రెట్టింపయ్యేలా కన్పిస్తోందంటున్నారు.