Monday, December 23, 2024

బౌల్ట్ నుంచి డ్రిఫ్ట్‌, కాస్మిక్ స్మార్ట్‌వాచ్‌లు విడుదల

- Advertisement -
- Advertisement -

Drift and Cosmic smartwatches released by Boult

 

న్యూఢిల్లీ : ఆడియో కంపెనీ బౌల్ట్ డ్రిఫ్ట్‌, కాస్మిక్ పేరుతో రెండు స్మార్ట్‌వాచ్‌ల‌ను భార‌త్‌లో లాంఛ్ చేసింది. అందుబాటు ధ‌ర‌లో ప‌లు హెల్త్ ఫీచ‌ర్లు, యాక్టివిటీ ట్రాకర్స్‌తో స్మార్ట్‌వాచ్‌ల‌ను ప్ర‌వేశ‌పెట్టింది. బౌల్ట్ డ్రిఫ్ట్‌, కాస్మిక్ వాచ్‌లు మెరుగైన బ్యాట‌రీ లైఫ్‌తో క‌స్ట‌మ‌ర్ల‌ను ఆక‌ట్టుకుంటాయ‌ని కంపెనీ చెబుతోంది. జులై 3న డ్రిఫ్ట్‌ను లాంఛ్ చేశామ‌ని, ఈనెల 9న కాస్మిక్ క‌స్ట‌మ‌ర్ల ముందుకు రానుంద‌ని వెల్ల‌డించారు. మిలీనియ‌ల్స్ ఫిట్‌గా ఆరోగ్యంగా ఉండేందుకు ఉప‌క‌రించే ఉత్ప‌త్తుల‌ను ప్ర‌వేశ‌పెడుతున్నామ‌ని తెలిపారు. ఇక బౌల్ట్ డ్రిఫ్ట్ స్మార్ట్‌వాచ్ రూ 1999కు అందుబాటులో ఉండ‌గా కాస్మిక్ రూ 1499కి ల‌భిస్తుంది. ఫ్లిప్‌కార్ట్‌లో సేల్‌కు ఈ స్మార్ట్‌వాచ్‌లు ల‌భించ‌నున్నాయి. బౌల్ట్ డ్రిఫ్ట్ బ్లూ, బ్లాక్‌, గ్రే వైట్ క‌లర్స్‌లో లభిస్తుండగా, కాస్మిక్ రోజ్ గోల్డ్‌, బ్లూ, బ్లాక్ షేడ్స్‌లో క‌స్ట‌మ‌ర్ల‌కు లభించనున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News