Monday, January 20, 2025

డ్రిల్లింగ్ పనులకు ఆటంకాలు

- Advertisement -
- Advertisement -

ఉత్తరాఖండ్ టన్నెల్ కూలీలకు సంకట స్థితి

డెహ్రాడూన్ : ఉత్తరాఖండ్‌లోని ఉత్తర్‌కాశీలో సొరంగంలో చిక్కుపడ్డ 40 మంది నిరుపేద కూలీల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. గంటలు గడుస్తున్న కొద్దీ లోపలి బడుగు జీవుల భవితపై ఆందోళన తీవ్రతరం అవుతోంది. అమెరికా నుంచి వచ్చిన భారీ యంత్రంతో ఇక్కడ సహాయక చర్యలు జరుగుతున్నాయి. శుక్రవారం తిరిగి రాళ్లు మట్టిపెళ్లలు విరిగిపడటంతో లోపలివారిని వెలికితీసే పనులు నిలిచిపొయ్యాయి. అత్యధిక సామర్థపు ఆగెర్ డ్రిల్లు మిషన్ పనులను కొద్ది గంటల పాటు నిలిపివేశారు. తరువాత ఇక్కడికి మరికొన్ని యంత్రాలను రప్పించారు.

తిరిగి సహాయక చర్యలు చేపట్టారు. పనులకు ఆటంకాలు తొలిగినట్లు అధికారులు తెలిపారు. ఛార్‌దామ్ ప్రాజెక్టులో భాగంగా ఇక్కడ సిల్క్‌యారా టన్నెల్ పనులు జరుగుతున్నాయి. ఇందుకోసం ఎక్కువ సంఖ్యలో కార్మికులను రంగంలోకి దింపారు. ఇప్పటి పరిస్థితి గురించి అధికారులు విలేకరులకు తెలిపారు. ఓ వైపు డ్రిల్లింగ్ మిషన్ పనులు జరుగుతున్నప్పుడు అడ్డుగా శిథిలాలు వచ్చిపడ్డాయని అధికారులు వివరించారు.

తమ వైపు భారీ స్థాయి రాళ్లు రప్పలు వచ్చిపడుతూ ఉండటంతో రెస్కూ కార్యక్రమంలో ఉన్న వర్కర్లు అక్కడి నుంచి తలోదిక్కుకు పరుగులు తీశారు. గంట సేపు పని నిలిచిపోయింది. గురువారం రాత్రి కొంత మేర కూలీల వెలికితీత పనులు సాఫీగా సాగాయి. దీనితో ఇక తెల్లవారుజాము వరకూ వీరిని బయటకు తీసుకురావచ్చునని అంతా ఆశించినా , తరువాతి ఆటంకాలు ఇబ్బందికరంగా మారాయి. నిర్మాణ పనుల దశలోనే సొరంగం కుప్పకూలడం లోపల పనులలో ఉన్న కూలీలకు పిడుగుపాటు అయింది.

కూలీల వెలికితీతకు నిపుణులు లోపలికి 900 మిమిలు వెడల్పు, 6 మీటర్ల పొడవైన పైపులను పంపించారు. కేవలం మూడు అడుగుల లోపు ఉండే వీటి ద్వారా లోపలి కూలీలు బయటకు రావల్సి ఉంటుంది. ఇప్పుడు సహాయక చర్యలకు తలెత్తిన ఆటంకాలను డైమండ్ బిట్ మిషిన్లతో తొలిగించినట్లు అధికారులు తెలిపారు. లోపల పేరుకుపోయిన శిథిలాలో శుక్రవారం 40 మీటర్ల మేర వాటిని తొలిగించినట్లు సిల్క్‌యారా కంట్రోలు రూం అత్యవసర చర్యల విభాగం తెలిపింది.

రాత్రికి డ్రిల్లింగ్ పనులు పూర్తి
ఇప్పటి అంచనాల మేరకు డ్రిల్లింగ్ పనులు శుక్రవారం రాత్రికి పూర్తవుతాయని విపత్తు నిర్వహణ విభాగం అధికారి దేవేంద్ర పాట్వాల్ మధ్యాహ్నం విలేకరులకు తెలిపారు. తరువాత లోపలివారు సురక్షితంగా బయటకు వచ్చే పైపులతో కూడిన ఎస్కేప్ పైపులను అమర్చడం జరుగుతుందని వివరించారు. డ్రిల్లింగ్ పనులలో పురోగతి ఉందని జాతీయ రహదారులు, మౌలిక ఏర్పాట్ల కల్పన విభాగం సంస్థ డైరెక్టర్ అంశు మనీషు హల్కో తెలిపారు. సహాయక చర్యలు ఇప్పుడు ఆరవ రోజుకు చేరాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News