Saturday, November 23, 2024

ఆరోగ్య ప్రయోజనాలకు పరగడుపున సబ్జా నీళ్లు త్రాగండి

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: పోషకాలు అధికంగా ఉండే సూపర్‌ఫుడ్, సబ్జా వాటర్.  మీ బ్లడ్ షుగర్ లెవల్స్ , బరువు తగ్గడానికి అద్భుతంగా పనిచేస్తుంది. ఖాళీ కడుపుతో దీన్ని తీసుకోవడం వల్ల కలిగే అన్ని ప్రయోజనాలు ఇవి:

మీరు బరువు తగ్గాలన్నా, మీ శరీరాన్ని నిర్విషీకరణ చేయాలన్నా లేదా రక్తంలో చక్కెరను స్థిరంగా ఉంచుకోవాలన్నా, దానికి సరైన సమాధానం సబ్జా నీరు. సబ్జాను 15-30 నిమిషాలు నీటిలో నానబెట్టి, ఆ నీటితో పాటు, నిమ్మరసంతో కలిపి తీసుకుంటే, పోషకమైన పానీయంగా తయారవుతుంది. ఖాళీ కడుపుతో దీన్ని తీసుకోవడం వల్ల ఎంతో ఉపయోగకరం, జీవక్రియను పెంచుతుంది , గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది. సబ్జా గింజలు మీ చర్మాన్ని, వెంట్రుకలకు కూడా ఎంతో మేలు చేస్తుంది.

బెంగళూరుకు చెందిన న్యూట్రనిస్ట్ అభిలాష వి. సబ్జా గింజల ప్రయోజనాల గురించి వివరించారు.

సబ్జా గింజలు పౌష్టికమైనవని అన్నారు. అందులో ప్రొటీన్, కావలసిన ఫ్యాటీ యాసిడ్స్, డైట్రీ ఫైబర్, వివిధ విటమిన్లు, ఖనిజాలు, కాల్షియం, మెగ్నేషియం, ఐరన్ ఇందులో ఉన్నాయన్నారు.  ఖాళీ కడుపు(పరగడుపున) దీన్ని సేవిస్తే శరీరానికి పోషకాలు అందుతాయన్నారు.

జీర్ణక్రియకు తోడ్పడుతుంది. పొద్దునే పరగడుపున నిమ్మ రసంతో కలిపి సబ్జా నీరు త్రాగితే జీర్ణాశయాన్ని శుభ్రం చేస్తుంది. కడుపులోని గ్యాస్, త్రేన్పులను మాన్పుతుంది.

శరీర బరువును అదుపులో ఉంచుతుంది. జబ్జా గింజలు నీళ్లలో నాన్చాక అవి ఉబ్బుతాయి. జెల్ వలే తయారవుతుంది. శరీర బరువుకు ఇది ఎంతో ఉపయోగకరం.

రక్తంలోని చక్కెరను అదుపులో ఉంచుతుంది.

సబ్జా నీళ్లు శరీరంలో నీటి శాతాన్ని (హైడ్రేషన్) పెంచుతుంది. అది జీర్ణానికి, రక్త ప్రసరణనకు, శరీర ఉష్ణోగ్రత నియంత్రణకు తోడ్పడుతుంది.

సబ్జా గింజలు శరీరంలోని విషతుల్యాలను(టాక్సిన్స్) తొలగిస్తుంది. ఖాళీ కడుపున సబ్జా నీళ్లు త్రాగితే కాలేయం, కిడ్నీలలోని విషతుల్యాలు శుభ్రం అవుతాయి. మొత్తం మీద శరీర మెటబాలిజం బాగా పనిచేసేందుకు తోడ్పడుతుంది.

చర్మానికి కూడా ఎంతో ఉపయోగకరం. సబ్జా నీరు త్రాగడం వల్ల మొటిమలు, తామర వంటివి పోతాయి. శరీరం కాంతివంతంగా తయారవుతుంది.

సబ్జా నీరు రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది. అంతేకాదు దీనివల్ల గుండెకు కూడా మేలు జరుగుతుంది. రక్తప్రసరణనను మెరుగుపరిచి హృద్రోగాలు రాకుండా చూస్తుంది.

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News