Friday, January 24, 2025

డ్రింకర్ సాయి సినిమా నుంచి నువ్వు గుద్దితే లిరికల్ సాంగ్ విడుదల

- Advertisement -
- Advertisement -

ధర్మ, ఐశ్వర్య శర్మ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా ‘డ్రింకర్ సాయి‘. బ్రాండ్ ఆఫ్ బ్యాడ్ బాయ్స్ అనేది ఈ చిత్ర ట్యాగ్ లైన్. ఈ చిత్రాన్ని ఎవరెస్ట్ సినిమాస్, స్మార్ట్ స్క్రీన్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై బసవరాజు శ్రీనివాస్, ఇస్మాయిల్ షేక్, బసవరాజు లహరిధర్ నిర్మిస్తున్నారు. కొన్ని వాస్తవ ఘటనల ఆధారంగా దర్శకుడు కిరణ్ తిరుమలశెట్టి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ నెల 27న ఈ సినిమా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ ఉ్వతోంది. ‘డ్రింకర్ సాయి‘ సినిమా నుంచి ’నువ్వు గుద్దితే..’ లిరికల్ సాంగ్ రిలీజ్ చేశారు. ‘నువ్వు గుద్దితే..’ లిరికల్ సాంగ్ ను శ్రీ వసంత్ కంపోజ్ చేయగా, చంద్రబోస్ లిరిక్స్ అందించారు. జెస్సీ గిఫ్ట్ పాడారు. ఈ పాట ఎలా ఉందో చూస్తే – ’నువ్వు గుద్దితే ముద్దు పెట్టినట్టున్నదే, నువ్వు తన్నితే వెన్నపూసినట్టున్నదే..’ అంటూ హీరో, హీరోయిన్‌ను టీజ్ చేస్తూ సాగుతుందీ పాట.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News