Saturday, December 21, 2024

మద్యం దుకాణంలో చల్లని బీర్లు లేవని ఆందోళన..

- Advertisement -
- Advertisement -

ఉప్పునుంతల: ఉప్పునుంతల మండల కేంద్రంలోని లక్ష్మీదుర్గ మద్యం దుకాణంలో చల్లని బీర్లు అమ్మలేదని మద్యం ప్రియులు అందోళన చేశారు. గ్రామస్తుల వివరాల ప్రకారం గురువారం మద్యాహనం కోందరు యువకులు మద్యం దుకాణాంలో బీర్లు కోనుగోలు చేశారు. చల్లని బీర్లు కావలని అడిగిన చల్లనివి లేవు అంటూ యువకులపై మద్యం యాజమాని దురుసుగా ప్రవర్తించడంతో అగ్రహించిన యువకులు మద్యం దుకాణాదారునితో వాగ్వివాదం చేసి దుకాణాన్ని మూసివేశారు.అనంతరం అబ్కారి సిఐకు సమాచా రం అందించడంతో వారు మద్యం దుకాణాంకు చేరుకోని మద్యం దుకాణాన్ని తెరిపించారు. అనంతరం సిఐతో యువకులు వాగ్వివా దానికి దిగారు.

మద్యం యాజమానుల సమాయపాలన పాటించడంలేదని, వారికి ఇష్ఠం వచ్చినట్లు దుకాణాన్ని తెరుస్తున్నారని, అన్ని రకాల మద్యం అందుబాటులో ఉండటంలేదని, మద్యం తాగేందుకు పర్మిట్ రూమ్ లేదని పిర్యాదు చేశారు.అదే విదంగా గ్రామ నడిబోడ్డులో మద్యం దుకాణాం ఉన్నందును నానా రకాల ఇబ్బందులు గురవుతున్నాయాని వాపోయ్యారు. గ్రామంలో ప్రతి కిరాణ దుకాణం బెల్టుదుకాణాలుగా మారిపోయాయని వారి దృష్టికి తెచ్చారు. తక్షణమే యాజమానిపై చర్యలు తీసుకోవాలని యువకులు బైఠాంచారు. అనంతరం సిఐ జనార్ధన్ యువకులతో మాట్లాడి సమస్యలను పరిష్కరిస్తామాని చేప్పడంతో యువకులు శాంతించారు. కార్యక్రమంలో యువకులు చిన్నజంగయ్య, నిరంజన్‌గౌడు, కాలూరి మల్లేష్, పర్వతాలు. శ్రీశైలం, వాసు, పుల్లయ్య, తదితరులు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News