Monday, January 20, 2025

భక్తులకు జలమండలి తాగునీటి శిబిరాలు

- Advertisement -
- Advertisement -

Drinking water camps for Ganesh Immersion

ఓఆర్‌ఆర్ పరిధిలో 196 వాటర్ క్యాంపులు
భక్తుల కోసం 30.72లక్షల వాటర్ ప్యాకెట్లు సిద్దం
అన్నదాన శిబిరాలకు ఉచితంగా వాటర్ ట్యాంకర్లు సరఫరా

హైదరాబాద్: వినాయక నిమజ్జనానికి తరలివచ్చే భక్తులకు తాగునీటిని అందించడంతో పాటు శోభయాత్ర సాఫీగా జరిగేందుకు జలమండలి ఏర్పాట్లు చేసింది. భక్తుల కోసం తాగునీటి శిబిరాలను ఏర్పాటు చేసింది. ఇప్పటికే 3,5,7,9వ రోజుల్లో నిమజ్జనం కోసం ఓఆర్‌ఆర్ పరిధిలో ఏర్పాటు చేసిన నీటి కొలనుల వద్ద జలమండలి 74 తాగునీటి శిబిరాలను నిర్వహించింది. శుక్రవారం జరగనున్న నిమజ్జనం కోసం అదనంగా మరో 122 తాగునీటి శిబిరాలను ఏర్పాటు చేసింది. శోభయాత్ర జరగనున్న దారి వెంట, ట్యాంక్‌బండ్ పరిసరాలతో పాటు నిమజ్జనం కొలనుల వద్ద ఈ శిభిరాలను ఏర్పాటు చేశారు. వీటిలో మొత్తం 30.72 లక్షల వాటర్ ప్యాకెట్లను అందుబాటులో ఉంచింది. వాటర్ ప్యాకెట్లే కాకుండా అవసరమైన చోట్ల డ్రమ్ముల్లో కూడా తాగునీటిని అందుబాటులో ఉంచనుంది. అలాగే, మంచినీటి శిభిరాల్లో భక్తులకు మంచినీటిని అందించేందుకు 24 గంటలు షిప్టుల వారీగా సిబ్బందిని అందుబాటులో ఉంచుతారు.

రద్దీని బట్టి కొన్ని ప్రాంతాల్లో 24 గంటలు, మరికొన్ని ప్రాంతాల్లో 48 గంటల పాటు మంచినీటి శిబిరాల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తోంది. నగర వ్యాప్తంగా ఏర్పాటు చేసే అన్నదాన శిబిరాలకు ఉచితంగా వాటర్‌ట్యాంక్‌ల ద్వారా నీటిని సరఫరా చేస్తోంది. జలమండలి క్వాలిటీ ఆస్యూరెన్స్ టీమ్‌లు ఎప్పటికప్పుడు వాటర్ క్యాంపుల్లో మంచినీటి నాణ్యతను పరీక్షించడంతో పాటు క్లోరిన్ లెవల్స్ తగిన మోతాదులో ఉండేలా చూస్తున్నాయి. గణేష్ నిమజ్జన శోభాయాత్ర జరిగే అన్ని రూట్లలో ఎటువంటి ఆటంకాలు, ఇబ్బందులు కలగకుండా వాటర్ లీకేజీలు, సివరేజీ ఓవర్‌ప్లో లేకుండా జలమండలి ముందుస్తు నిర్వహణ చర్యలు చేపట్టింది. వినాయక నిమజ్జనం సందర్భంగా మంచినీటి శిభిరాల పర్యవేక్షణ, ఇతర సమస్యలు తలెత్తకుండా చూసేందుకు జలమండలి నోడల్ అధికారులను నియమించింది. దీంతో పాటు ట్యాంక్‌బండ్, ఎన్టీఆర్‌మార్గ్‌లో రెండు కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News