Wednesday, January 22, 2025

ప్రత్యేక రాష్ట్రంలో ఇంటింటికి తాగునీరు

- Advertisement -
- Advertisement -
  • మిషన్ భగీరథతో మహిళలకు తీరిన నీటి కష్టాలు
  • ఆసాధ్యం కాదని వాదించిన సుసాధ్యం చేసిన కేసిఆర్
  • తెలంగాణ పథకాలు ఇతర రాష్ట్రాలకు ఆదర్శం
  • విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి , జడ్పిచైర్ పర్సన్ తీగల అనితా హరినాథ్‌రెడ్డి

కందుకూరు: ఇంటింటికి త్రాగునీరు అందించడం సుసాధ్యం కాదని ఏందరో వాదించిన సుసాధ్యం చేస్తామనే నమ్మకంతో మిషన్ భగీరథ పథకం ప్రవేశపెట్టి తెలంగాణ రాష్ట్రంలోని మారుమూల గ్రామానికి సైతం తాగునీరు అందించిన ఘనత తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావుకు దక్కిందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి. సబితా ఇంద్రారెడ్డి అన్నారు.

తెలంగాణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా ఆదివారం కందుకూరు మండల పరిధిలోని ముచ్చర్లలో మంచినీటి పండుగను పురస్కరించుకొని ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జడ్పి చైర్‌పర్సన్ తీగల అనితా హరినాథ్‌రెడ్డి, ఇబ్రహింపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డిలతో కలిసి మంత్రి పాల్గొని మాట్లాడారు. మిషన్ భగీరథ పథకం ద్వారా ఇంటింటికి నల్లాల ద్వారా మంచినీటిని అందించి మహిళల నీటి కష్టాలు దూరం చేశారన్నారు.

గతంలో నీటి సరఫరా సరిగ్గా లేని కారణంగా సీజనల్ వ్యాధులు, ప్లోరోసిస్ సమస్యలు ఉత్పన్నమయ్యేవని నేడు అలాంటి సమస్యలు లేకుండా చేశారని అన్నారు. మహేశ్వరం నియోజకవర్గంలో పెరుగుతున్న నగర, మున్సిపాలిటీల జనాభాకు అనుగుణంగా రూ.210 కోట్లతో నూతన పైప్‌లైన్లు, రిజర్వాయర్లు, వాటర్ ట్యాంకులు నిర్మిస్తున్నామన్నారు. ముచ్చర్ల నీటి శుద్ధీకరణ కేంద్రంలో తాగునీటి శుద్ధీకరణను పరిశీలించి ప్రతిరోజు ఏంత జనాభాకు నీటి సరఫరా చేస్తున్నారో సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు.

మిషన్ భగీరథ పథకం ద్వారా తెలంగాణలో సుమారు 23,839 గ్రామాల్లో 57,01 లక్షల ఇండ్లకు, మున్సిపాలిటీల్లో విలినమైన 649 గ్రామాలకు 121 మున్సిపాలిటీలకు, అడవులు, కొండల్లో ఉన్న 136 గ్రామీణ ప్రాంతాలకు మిషన్ భగీరథ ద్వారా తాగునీరు అందిస్తున్నామని తెలిపారు. దీంతోపాటు ప్రభుత్వ పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలు, ప్రభుత్వ సంస్థలకు నీటి కనెక్షన్ల ద్వారా సరఫరా చేస్తున్నారు. ముచ్చర్ల గ్రీన్ ఫార్మా సిటీలో భూములు కోల్పోయిన 179 మంది రైతులకు నష్ట పరిహారంతోపాటు ఫార్మా సిటీలో ఏర్పాటు చేసిన హెచ్‌ఎండిఓ లే అవుట్‌లో ఎకరా కోల్పోయిన రైతుకు 1 గుంట చొప్పున మంజూరుచేసిన ప్లాట్ పత్రాలను లబ్ధిదారులకు అందజేశారు.

అలాగే వివిధ గ్రామాలకు చెందిన 84 మహిళలకు మంజూరైన షాదీ ముబారక్ , కళ్యాణలక్ష్మి చెక్కులను మంత్రి చేతులమీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి మంద జ్యోతిపాండు, జడ్పిటిసి బొక్క జంగారెడ్డి, వైస్ ఎంపిపి గంగుల శమంత ప్రభాకర్,సర్పంచ్ ఇంజమూరి రాంచంద్రారెడ్డి, ఎంపిటిసి మల్లేష్, మహేశ్వరం మార్కెట్ కమిటి చైర్మన్ సురసాని సురేందర్ రెడ్డి, పిఎసిఎ చైర్మన్ చంద్రశేఖర్, ఎంపిడిఓ వెంకట్‌రాములు, ఎంఆర్‌ఓ ఎం. మహేందర్‌రెడ్డి, సర్పంచులు గంగాపురం గోపాల్‌రెడ్డి, రామకృష్ణారెడ్డి, శ్రీనివాస్, జి. కళమ్మరాజు, సధాలక్ష్మిపుల్లారెడ్డి, బి. జ్యోతిశేఖర్, ఎంపిటిసిలు గుండాల సురేష్, బిఆర్‌ఎస్ మండలాద్యక్షుడు జయేందర్ ముదిరాజ్, నాయకులు గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News