Sunday, September 8, 2024

పొదుపుగా వాడండి

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : కృష్ణానదిలో ఎగువనుంచి వరదనీటి ప్రవాహాలు లేని కారణంగా రిజర్వాయర్లలో ఉన్న కొద్దిపాటి నీటినే తాగునీటి అవసరాలకు పొదుపుగా వాడుకోవాలని కృష్ణానది యాజమాన్య బోర్డు త్రిసభ్య కమిటీ తీర్మానించింది. సోమవారం జలసౌధలో బోర్డు సభ్యకార్యదర్శి రాయపురే అధ్యక్షతన త్రిసభ్యకమిటీ సమావేశం జరిగింది. సమావేశంలో తెలంగాణ , ఆం ధ్రప్రదేశ్ రాష్ట్రాల నీటిపారుదల శాఖల ఈఎన్సీ లు అనిల్ కుమార్, నారాయణరెడ్డి పాల్గొన్నారు. సమావేశంలో కృష్ణానది పరివాహకంగా వర్షా లు, వరదనీటి ప్రవాహాలు, ప్రాజెక్టులకు నీటి చేరికలు, రిజర్వాయర్లలో నిలువ నీటి అంచనాలపై చర్చించారు. ఎగువ నుంచి జూరాలకు మినహా దిగువన ఉన్న మరే ప్రాజెక్టుకు నీటి చేరికలు లే వు. జూరాలకు ఈ సీజన్‌లో ఇప్పటివరకూ 8టిఎంసీల నీరు చేరింది. శ్రీశైలం ప్రాజెక్టుకు ఎగువ నుంచి 7టిఎంసీల నీరు చేరింది. ప్రాజెక్టులో నీటిమట్టం 813అడుగుల వద్ద డెడ్‌స్టోరేజి స్థాయిలో 36టిఎంసీల నీరు ఉన్నట్టు త్రిసభ్యకమిటి అం చనా వేసింది.

తెలంగాణ  తాగునీటి అవసరాలకోసం కేటాయించిన నీటిని నాగార్జున సాగర్ రిజర్వాయర్ నుంచి వినియోగించుకునేందుకు త్రిసభ్య కమిటీ అమొదం తెలిపింది. ఆంధ్రప్రదేశ్‌లో కూడా తాగునీటి అవసరాలకు సాగర్ రిజర్వాయర్ నుంచి 4.5టిఎంసీలు కావాలని ఏపి ఈఎన్సీ కోరారు. నాగార్జున సాగర్‌కు ఎగువనుంచి నీటి ప్రవాహాలు పూర్తిగా నిలిచిపోయాయి. ప్రాజెక్టులో నీటిమట్టం 503అడుగులకు పడిపోయింది. రిజర్వాయర్‌లో డెడ్‌స్టోరేజి కింద 120టిఎంసీల నీరు ఉన్నట్టు త్రిసభ్యకమిటి అంచనా వేసింది. ప్రాజెక్టుకు ఎగువ నుంచి వరదనీరు వచ్చేదాక రిజర్వాయర్‌లో డెడ్‌స్టోరేజిగా మిగిలిన ఈ నీటినుంచే రెండు రాష్ట్రాల్లో తాగునీటి అవసరాలు తీర్చుకోవాల్సివున్నందున నీటిని పొదుపుగా వినియోగించుకునేందుకు రెండు రాష్ట్రాలు ఆంగీకారం తెలిపాయి. సాగర్ రిజర్వాయర్ నుంచి మోటార్ల ద్వారా తెలంగాణ రాష్ట్రం కృష్ణాజలాలను ఇప్పటికే వినియోగికుంటున్నందున తమకు కూడా నీటిని విడుదల చేయాలని ఏపి కోరింది.తాగునీటి అవసరాల రిత్యా బుధవారం నుంచి నాగార్జున సాగర్ కుడికాలువ ద్వారా 4.5టిఎంసీల నీటివిడుదలకు త్రిసభ్యకమిటి ఆమోదం తెలిపినట్టు అధికారులు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News