Friday, December 20, 2024

తండ్రి కల.. తనయుడి సహకారం

- Advertisement -
- Advertisement -

కోనరావుపేట: తండ్రి కల.. తనయుడు సహకారం చేశాడు. 165 కోట్లతో మల్కాపేట రిజర్వాయర్ నుండి నిమ్మపల్లి ములవాగు ప్రాజెక్టులోకి ఎత్తిపోతలు, 50 సంవత్సరాలకు నెరవేరిన మాజీ సిరిసిల్లా ఎమ్మెల్యే చెన్నమనేని రాజేశ్వరావు కళ. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటైన మొదటి నుండి సాగు, త్రాగు నీటి సమస్యలకు శాశ్వత పరిస్కారం చేయాలని దేశంలోనే మొటిగా మిషన్ కాకతీయ పథకంతో పాత చెరువులు, కుంటాల్లో పూడికలు తీసి చెరువులలో వర్షం, వరద నీరు నిల్వ ఉండేలా పని చేసింది. అదే క్రమంలో మెట్ట ప్రాంతాల్లో ఉన్న బీడు భూములు సాగులోకి వచ్చి ఆ ప్రాంతాలు సస్యశ్యామలం కావాలనే ఉంద్దేశ్యంతో రిజర్వాయర్లు, ప్రాజెక్టులు నిర్మించడానికి సీఎం కేసిఅర్ శ్రీకారం చుట్టాడు. అందులో రాజన్న సిరిసిల్లా జిల్లా కోనరావుపేట మండలంలో ప్యాకేజి-9 లో భాగంగా మల్కాపేట రిజర్వాయర్ నిర్మించి మండలంలో 25 వేల ఎకరాల బీడు భూములు సాగులోకి వచ్చేలా నిర్మించారు.

అక్కడ నుండి మెట్ట ప్రాంతమైన నిమ్మపల్లి ములవాగు ప్రాజెక్టుకు 165 కోట్లతో సాగునీటి ఎత్తిపోతల పథంతో నీరు నిం పడానికి పనులు వేగంగా జరుగుతున్నాయి. అయితే అప్పటి సిరిసిల్లా నియోజకవర్గ ఎమ్మెల్యే చెన్నమనేని రాజేశ్వరరావు మెట్ట ప్రాంతమైన నిమ్మపల్లి చుట్టుపక్కల గ్రామాల్లో వ్యవసాయం చేయడానికి సాగునీరు లేక ఈ ప్రాంత రైతులు ఇతర ప్రాంతాలకు వలస వెళ్లి కూలీ పని చేసుకొని బ్రతుకుతున్నారని, కొందరు విప్లవ పార్టీలకు ఆకర్షితులై రాజకర్లకు వ్యతిరేకంగా పోరాడడంలో అశువులు బాశారు. అదే సమయంలో ఎమ్మెల్యే రాజేశ్వరరావు నిమ్మపల్లి ములవాగుప్రాజెక్టు నిర్మిచా డు. దీనితో చుట్టూ 5 గ్రామాలకు సుమారు 25 వందల ఎకరాలకు సాగునీరు అందించడంతో బీడు భూములు సస్యశ్యామలం అయినాయని రైతులు చెపుతున్నారు.

రాజేశ్వరావు నిమ్మపల్లి ములవాగు ప్రాజెక్టు నిర్మించడాని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రజలందరికీ తెలిసిన విషయమే! అయితే వ ర్షం వరద నీరు వస్తేనే ప్రాజెక్టు నిండుతుందని లేకుంటే ఇక్కడి రైతులకు పంటలు పండే అవకాశం లేదని, రెండు పంటలకు సాగునీరు అందించాలంటే ఎత్తిపోతల ద్వారానే సాధ్యమని రాజేశ్వరావు అప్పటి ప్రభుత్వాలతో, ముఖ్యమంత్రులతో ప లుమార్లు విన్నవించారు. అయిన ఎవరు పటించుకున్న పాపాన పోలేదని సభల లో, వ్యక్తిగతగా నియోజకవర్గ ప్రజలకు, తన తయుడు ఇప్పటి వేములవాడ ని యోజకవర్గ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబుకు చెప్పాడు. ఆ విషయాన్ని దృష్టి లో ఉంచొక్కాన్న రమేష్ బాబు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలతో పలుమార్లు గు ర్తు చేసిన ఫలితం లేకుండా పోయింది. అయితే తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మన ప్రభుత్వం వచ్చింది. మన ప్రజలకు, రైతులకు న్యాయం జరుగుతుందని రమేష్ బాబు విశ్వసించాడు.

అదేక్రమంలో సీఎం కేసీఆర్,మంత్రి కేటీఆర్, హరీష్ రావు, బోయినిపల్లి వినోద్ కుమార్ సహకారంతో మల్కాపేట రిజర్వాయర్ నుండి నిమ్మపల్లి ములవాగు ప్రా జెక్టు లోకి ఎత్తిపోతల ద్వారా నీరు అందించాలని ఇది మా తండ్రి మాజీ సిరిసిల్లా ఎమ్మెల్యే రాజేశ్వరావు కళ అని, దీనితో చుట్టుపక్కల అన్ని గ్రామాల్లో వ్యవసాయం మెరుగుపడుతుంది, రైతులు ఆర్థికం గా అభివృ ద్ధి చెందుతారని ప్రభుత్వాన్ని ఓపించాడు. దీనితో మల్కాపేట రిజర్వాయర్ నుండి నిమ్మపల్లి ములవాగు ప్రాజెక్టులోకి పైపు లైన్ ద్వారా ఎత్తిపోతల పతకం పనులు వే గంగా జరుగుతున్నాయి. 50 సంవత్సరాల తండ్రి మాజీ ఎమ్మెల్యే రాజేశ్వరావు కళను.. తనయుడు వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబు సహకా రం చేశాడని రైతులు, ప్రజలు అనుకుంటున్నారు. దీనితో మెట్ట ప్రాం తాల చెరువులు కొండ చెరువు, రాయిని చెరువు, గర్జనపల్లి, మద్దిమ ల్ల బాబాయి చెరువు, చీ మనపల్లి ప్రాంత రైతులకు సాగు నీరు కొద్దీ రోజుల్లోనే అందుతుందని, రాజేశ్వరా వు కళతోనే ఇది సాధ్యమైందని రమేష్ బాబు అన్నాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News