Wednesday, January 22, 2025

రాజంపేట్‌లో తాగునీటి ఇబ్బందులు

- Advertisement -
- Advertisement -

రాజంపేట్ : మండల కేంద్రంలో తాగునీటీ కోసం గ్రామ ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. మిషన్ భగీరథ నీరు సరిగా రాకపోవడం, వచ్చిన కొన్ని ప్రాంతాలలో అంతంత మాత్రమే వస్తున్నాయని తాగడానికి నీరు లేక అవస్థలు పడుతున్నామని గ్రామస్తులు వాపోతున్నారు. అలాగే గ్రామ కమిటీ ఆధ్వర్యంలో ఎర్పాటు చేసిన గ్రామ వికాస్ సైతం పనిచేయక పోవడంతో తాగు నీటి కోసం ప్రైవేట్ నీటి సంస్థల వైపు వెళ్ళి తాగునీరు తెచ్చుకుంటున్నామని గ్రామస్తులు పేర్కొంటున్నారు.

ఐలమ్మ నుండి పాత గ్రామ పంచాయతీ, గాంధీ వరకు మిషన్ భగీరథ నీరు రాక అవస్థలు పడుతున్నామని, అధికారులు, పాలకులు స్పందించి గ్రామ ప్రజలకు మిషన్ భగీరథ తాగునీటి వసతితో పాటు గ్రామ వికాస్ పనిచేసే విధంగా చర్యలు చేపట్టాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు. తాగునీరు విషయం మన తెలంగాణ గ్రామ సర్పంచ్ సౌమ్య నాగరాజును వివరణ కోరాగా రెండు రోజులుగా మిషన్ భగీరథ నీరు రాని విషయం వాస్తవం అని అధికారులతో మాట్లాడి నీరు వచ్చేందుకు కృషిచేస్తున్నానని, పాత గ్రామ పంచాయతీ వద్ద నుండి మిషన్ భగిరథ నీరు వృథాగా పోతున్నాయని ఎవరికి వారు తగినన్ని నీరు పట్టుకోని నల్లాలు మూసి వేయాలి కాని ఎవరు అలాంటి ప్రయత్నం చేయడం లేదు.

దాంతో ఎగువ ప్రాంతం గలవారికి నీరు రావడం లేదని, గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో అవగాహన కల్పించిన తీరు మారడం లేదని ప్రత్యమ్నాయ ఎర్పాట్లు చేస్తామని అన్నారు. గ్రామ వికాస్ గ్రామ కమిటీ చూస్తుందని కారణాలు తెలుసుకోని కమిటీ దృష్టికి తీసుకెళ్తానని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News