Thursday, January 23, 2025

తాగునీటి పథకం దేశానికే ఆదర్శం

- Advertisement -
- Advertisement -
  • ఎమ్మెల్యే కాలె యాదయ్య

చేవెళ్లరూరల్: ప్రతి ఇంటికి మంచినీటిని అందిస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య తెలిపారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఆదివారం చేవెళ్ల గ్రామపంచాయతీ కార్యాలయంలో మంచినీళ్ల పండుగ (మిషన్ భగీరథ ఉత్సవాలు) ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాగునీటి పథకం దేశానికి ఆదర్శంగా నిలిచిందని, ప్రతి మరుమూల పల్లెకు పైపులైన్ వేసి తాగునీటిని అందించి ప్రజల దహర్తిని తీర్చిన ఘనుడు సీఎం కేసీఆర్ అని కొనియాడారు. మిషన్ భగీరథ ద్వారా స్వచ్చమైన, శుద్దమైన తాగునీటితో నల్గొండ జిలాను పట్టి పీడించిన ప్లోరైడ్ రక్కసిని నిర్మూలించిందన్నారు.

మిషన్ భగీరథ పథకంతో మంచినీటి సరఫరా జరుగుతుందని కేంద్ర జలశక్తి ప్రకటించిందని, ఈసందర్భంగా గుర్తు చేశారు. మిషన్ భగీరథ పథకానికి నేషనల్ వాటర్ కమిషన్ 2019లో మొదటి బహుమతి లభించిందన్నారు. గ్రామీణ ప్రాంతాలకు నల్లా కనెక్షన్ ద్వారా ప్రతి ఇంటికి మంచినీటిని అందిస్తున్నందుకు 2022 లో జల్‌జీవన్ అవార్డు (మొదటి బహుమతి) లభించిందని, వీటితో పాటు మరెన్నో అవార్డులు, రివార్డులను మిషన్ భగీరథ సాధించిందన్నారు.

సమైఖ్య పాలనలో తాగునీటి కోసం ఎన్నో ఇబ్బదులు పడ్డా ప్రజలకు స్వయం పాలనలో తాగునీటిని అందించి ప్రజల కష్టాలు తీర్చారని గుర్తు చేశారు. తెలంగాదణను సస్యశ్యామలం చేసి ప్రతి గొంతును శుద్ది చేసిన నీటిని తడుపుతామన్న కేసీఆర్ శపథం తెలంగాణ రాష్ట్రంలో మిషన్ భగీరథ నీళ్లతో నిరూపించారన్నారు. అనంతరం తెలంగాణ రాకముందు నీటి కోసం ప్రజలు పడ్డ కష్టాలను, నేడు నీటి సమస్యలు తీర్చిన చిత్రాలను స్క్రీన్ ద్వారా ప్రజలకు చూపించారు.

ఈ కార్యక్రమంలో ఆర్డీవో వేణుమాదవ్‌రావు, ఎంపీపీ విజయలక్ష్మిరమణారెడ్డి, జడ్పీటీసీ మాలతికృష్ణారెడ్డి, వైస్ ఎంపీపీ కర్నె శివప్రసాద్, ఎంపీడీవో రాజ్‌కుమార్, తహసీల్దార్ శ్రీనివాస్, మిషన్ భగీరథ ఏఈ గీతస్రవంతి, మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ గౌండ్ల యాదయ్య, నాయకులు కృష్ణారెడ్డి, రమణారెడ్డి, ఆయా గ్రామాల సర్పంచులు,ఎంపీటీసీలు, నాయకులు తదితరులు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News