Sunday, December 22, 2024

సంక్షోభం నుండి స్వర్ణ యుగం వైపు తాగునీటి రంగం

- Advertisement -
- Advertisement -

గుడిహత్నూర్ : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పాలనలో తెలంగాణ పల్లెలో తాగునీటి సంక్షోభాన్ని ఎదుర్కొన్నామని, సాధించుకున్న తెలంగాణలో తొమ్మిదేళ్ల కెసిఆర్ పాలనలో సాగునీటి, తాగునీటి రంగాల్లో సంక్షోభం నుండి బయటపడి స్వర్ణయుగంలో కొనసాగుతున్నామని బోథ్ శాసన సభ్యులు రాథోబ్ బాపురావు అన్నారు. తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా గుడిహత్నూర్ మండలం కేంద్రంలో నిర్వహంచిన మంచి నీటి దినోత్సవ వేడుకకు ముఖ్య అతిథిగా బోథ్ శాసన సభ్యులు రాథోడ్ బాపురావు హాజరయ్యారు. మొదటగా గుడిహత్నూర్ గ్రామ సర్పంచ్ జాదవ్ సునీత ఆధ్వర్యంలో గుడిహత్నూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి వద్ద గల మిషన్ భగీరథ ట్యాంకు పూజ చేశారు. అక్కడి నుండి గ్రామపంచాయతీ కార్యాలయం వద్దకు ర్యాలీగా బయలుదేరి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ముందుగా మిషన్ భగీరథ నీటిపై ప్రజల్లో గల అపోహాలు తొలగించేందుకు నిర్వహించిన పరీక్షలను ప్రజలతో కలిసి వీక్షించారు.

అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే బాపురావు మాట్లాడుతూ మన రాష్ట్రం సాధించుకున్న తర్వాత మిషన్ భగీరథ ద్వారా స్వచ్ఛమైన తాగునీరు అందుతున్నాయని పల్లెలు, పట్టణాలు అనే తేడా లేకుండా ప్రతి ఇంటికి స్వచ్చమైన తాగునీటిని అందించి అంటువ్యాధులు రాకుండా కాపాడుతున్న భగీరథుడు మన ముఖ్యమంత్రి కెసిఆర్ అని కొనియాడారు. మిషన్ భగీరథ నీటిపై అపోహాలను వీడి ప్రజలందరూ మిషన్ భగీరథ నీటిని వినియోగించుకోవాలని సూచించారు. తెలంగాణ రాష్ట్రం సంక్షేమంలో కానీ అభివృద్ధిలో కానీ దేశంలో మొదటి స్థానంలో ఉందన్నారు.

ఈ కార్యక్రమంలో మిషన్ భగీరథ ఎస్‌ఈ వెంకటేశ్వర్లు, తహసీల్దార్ సంధ్యారాణి, ఎంపిడివో సునీత, ఎంపివో లింగయ్య, సర్పంచ్ జాదవ్ సునీత, ఈఈలు గోపిచంద్, చంద్రమోహన్, డీఈఈ దేవయ్య, ఏఈఈ ఆదిత్య, కోఆప్షన్ సభ్యుడు జమీర్, బిఆర్‌ఎస్ మండల కన్వీనర్ కరాడ్ బ్రహ్మనంద్, ఆయా గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, మండల నాయకులు జాదవ్ రమేష్, జాదవ్ కేంద్రే, సలీం ఖాన్, రావణ్ ముండే గ్రామస్తులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News